- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss 7 Telugu contenstant Subhashree Rayaguru latest photos telugu cinema news
Bigg Boss 7 Telugu: బిగ్బాస్ హౌస్లో మరో అందాల తార.. ఆటతో కట్టిపడేస్తోన్న గ్లామర్ బ్యూటీ..
Updated on: Sep 16, 2023 | 1:58 PM

బిగ్బాస్ సీజన్ 7 రెండో వారం రసవత్తరంగా సాగుతోంది. పవర్ అస్త్ర గెలుచుకోవడానికి రెండు టీంలుగా ఏర్పడిన ఇంటి సభ్యులు నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడుతున్నారు. ముఖ్యంగా ఈ వారం శుభ శ్రీ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

తన ఆట తీరుతో ఎప్పటికప్పుడు అడియన్స్ కు దగ్గరవుతుంది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న గ్లామర్ బ్యూటీలలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. బిగ్బాస్ కంటే ముందు ఈ బ్యూటీ అంతగా అడియన్స్ కు తెలియదు.

ఒడిశాలో పుట్టి పెరిగిన శుభ శ్రీ రాయగురు. ఎల్ఎల్బీ కోర్సు పూర్తిచేసింది. చదువుకునే రోజుల నుంచే నటనపై ఆసక్తి ఉండేదట. లాయర్ గా పట్టా అందుకున్న తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

2020లో శుభ శ్రీ విఎల్ సీసీ ఫెమినా మిస్ ఇండియా ఒడిషా టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి లైవ్ షోస్ చేసింది.

ఈ క్రమంలోనే గతేడాది విడుదలైన రుద్రవీణ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాలో పోలీసు అధికారి పాత్రలో నటించింది.

ఇక ఇప్పుడు తన ఆట తీరుతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా శుభ శ్రీ లేటేస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

బిగ్బాస్ హౌస్లో మరో అందాల తార.. ఆటతో కట్టిపడేస్తోన్న గ్లామర్ బ్యూటీ..




