- Telugu News Photo Gallery Cinema photos Tollywood beauty Meenakshi Chaudhary share the screen with Dulquer Salmaan Sharwanands new film has completed shooting
దుల్కర్‌కు జోడిగా టాలీవుడ్ బ్యూటీ.. షూటింగ్ పూర్తి చేసుకున్న శర్వానంద్ కొత్త చిత్రం
తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ నిర్మాణ సంస్థలు ఇచ్చిన కంప్లయింట్స్‌ను పరిగణలోకి తీసుకున్న కౌన్సిల్ కొంత మంది నటీనటులకు రెడ్ కార్డ్ జారీ చేసింది. ధనుష్, శింబు, విశాల్‌తో పాటు విజయ్ సేతుపతి, అమలా పాల్, అథర్వ, ఎస్‌జే సూర్య, యోగిబాబు రెడ్ కార్డ్ అందుకున్న వారిలో ఉన్నారు. గదర్ 2 మూవీ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాను ఆడియన్స్‌కు మరింత చేరువ చేసే ఆలోచనలో ఉంది యూనిట్.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Sep 16, 2023 | 1:55 PM

Kollywood: తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ నిర్మాణ సంస్థలు ఇచ్చిన కంప్లయింట్స్‌ను పరిగణలోకి తీసుకున్న కౌన్సిల్ కొంత మంది నటీనటులకు రెడ్ కార్డ్ జారీ చేసింది. ధనుష్, శింబు, విశాల్‌తో పాటు విజయ్ సేతుపతి, అమలా పాల్, అథర్వ, ఎస్‌జే సూర్య, యోగిబాబు రెడ్ కార్డ్ అందుకున్న వారిలో ఉన్నారు.

Gadar 2: గదర్ 2 మూవీ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాను ఆడియన్స్‌కు మరింత చేరువ చేసే ఆలోచనలో ఉంది యూనిట్. అందుకే సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా గదర్ 2 టికెట్ రేటు 150 రూపాయలుగా నిర్ణయించారు మేకర్స్.

Meenakshi Chaudhary: టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉన్న మీనాక్షి చౌదరికి మరో గోల్డెన్స్ ఛాన్స్ దక్కింది. మల్టీ లింగ్యువల్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్నారు. తెలుగులో గుంటూరుకారం, మట్కా సినిమాలతో పాటు విశ్వక్‌సేన్ హీరోగా రూపొందుతున్న మరో మూవీలో నటిస్తున్నారు మీనాక్షి.

Rio Kapadia: బాలీవుడ్ సీనియర్ నటుడు రియో కపాడియా మృతి చెందారు. కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురువారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. దిల్ చహతా హై, చక్ దే ఇండియా, హ్యాపీ న్యూ ఇయర్ లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు రియో. ఇటీవల విడుదలైన మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్‌లో మృణాల్ ఠాకూర్‌కు తండ్రిగా నటించారు.

Sharwanand: ఒకే ఒక జీవితం సక్సెస్ తరువాత బ్రేక్ తీసుకున్న శర్వానంద్, నెక్ట్స్ సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి తన పార్ట్ షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమాలో శర్వాకు జోడిగా క్రితి శెట్టి నటిస్తున్నారు. ఈ మూవీతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు శర్వానంద్.





























