బాలీవుడ్ నుంచి సౌత్ ఎంట్రీ ఇచ్చిన క్యూట్ బ్యూటీ సయి మంజ్రేకర్. గని, మేజర్ లాంటి సినిమాతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించిన ఈ భామ అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేకపోయారు. రెండూ హీరో సెంట్రిక్ సినిమాలే కావటంతో సయికీ ప్రూవ్ చేసుకునేందుకు పెద్దగా స్కోప్ దక్కలేదు. దీంతో మరో ఛాన్స్ కోసం వెయిటింగ్‌లో ఉన్నారు ఈ భామ.