విక్రమ్‌తో కమల్ హాసన్, జైలర్‌తో రజనీ కాంత్ ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. చాలా ఏళ్ల తరువాత బ్లాక్ బస్టర్ హిట్ దక్కటంతో ఆ టెంపోను అలాగే మెయిన్‌టైన్ చేయాలని ఫిక్స్ అయ్యారు ఈ ఇద్దరు స్టార్స్. అందుకే వచ్చే ఏడాది ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసేలా స్కెచ్ రెడీ చేస్తున్నారు. విక్రమ్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన కమల్ హాసన్, సినిమాల మీద సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు. విక్రమ్ సెల్రబేషన్స్‌లోనే వరుస సినిమాలు ఎనౌన్స్ చేసిన యూనివర్సల్ స్టార్, 2024లో హ్యాట్రిక్ రిలీజ్‌లకు రెడీ అవుతున్నారు.