King of Kotha OTT: ఓటీటీలోకి దుల్కర్‌ సల్మాన్‌ ‘కింగ్ ఆఫ్ కొత్త’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైపోయారు మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌. అంతకుముందే దుల్కర్‌ నటించిన పలు సినిమాలు తెలుగులోకి డబ్‌ అయ్యి అలరించాయి. ఇటీవల అతను నటించిన గన్స్‌ అండ్‌ గులాబ్స్‌ వెబ్‌ సిరీస్‌ కూడా సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చేస్తూ బిబిబిజీగా ఉంటున్నాడీ హ్యాండ్సమ్‌ హీరో.

King of Kotha OTT: ఓటీటీలోకి దుల్కర్‌ సల్మాన్‌ 'కింగ్ ఆఫ్ కొత్త'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
King Of Kotha Movie
Follow us

|

Updated on: Sep 16, 2023 | 7:54 PM

మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైపోయారు మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌. అంతకుముందే దుల్కర్‌ నటించిన పలు సినిమాలు తెలుగులోకి డబ్‌ అయ్యి అలరించాయి. ఇటీవల అతను నటించిన గన్స్‌ అండ్‌ గులాబ్స్‌ వెబ్‌ సిరీస్‌ కూడా సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చేస్తూ బిబిబిజీగా ఉంటున్నాడీ హ్యాండ్సమ్‌ హీరో. ఇదిలా ఉంటే దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ఓ రీసెంట్‌ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానుంది. అభిలాష్ జోషీ దర్శకత్వంలో దుల్కర్‌ నటించిన సినిమా కింగ్‌ ఆఫ్‌ కొత్త. గ్యాంగస్టర్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటించింది. షబీర్‌ కల్లరక్కల్, ప్రసన్న, శరణ్‌ శక్తి, చెంబన్‌ వినోద్‌ జోస్, అనికా సురేంద్రన్, నైలా ఉష, శాంతి కృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. . గురు ఫేమ్ రితికా సింగ్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో ఆగస్టు 24న ఈ సినిమా విడుదలైంది. అయితే యావరేజ్‌రిజల్ట్‌తో సరిపెట్టుకుంది. అయితే ఎప్పటిలాగే దుల్కర్‌ సల్మాన్‌ తన నటనతో అదరగొట్టాడు. సినిమాలోని యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా బాగున్నాయని టాక్‌ వచ్చింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన కింగ్‌ ఆఫ్‌ కొత్త ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీప్లస్‌హాట్‌ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. సెప్టెంబర్‌ 22 నుంచి ఈ గ్యాంగ్‌ స్టర్‌ యాక్షన్‌ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడనుందట.

ఇవి కూడా చదవండి

ఫారెర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై జీస్టూడియోస్‌తో కలిసి దుల్కర్ సల్మాన్ స్వయంగా కింగ్‌ ఆఫ్‌ కొత్త సినిమాను నిర్మించారు. జేక్స్ బెజోయ్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాలో గ్యాంగస్టర్ రాజు అనే పాత్రలో దుల్కర్ నటించాడు. ఊర మాస్ గ్యాంగ్‌స్టర్‌గా అతని లుక్‌, నటన అదిరిపోయాయి. యాక్షన్‌తో పాటు లవ్‌ స్టోరీ, ఫ్రెండ్‌షిప్‌, ఎమోషనల్‌ డ్రామా.. ఇలా అన్నీ అంశాలు ఈ మూవీలో ఉన్నాయి. మరి థియేటర్లలో కింగ్‌ ఆఫ్‌ కొత్త సినిమాను మిస్‌ అయ్యారా? డోంట్‌ వర్రీ.. త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయండి.

దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్

కింగ్ ఆఫ్ కొత్త ట్రైలర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..