Tollywood: ఈ అందాల రాశి టాలీవుడ్ ముద్దుగుమ్మ.. యూత్ ఫేవరేట్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి..

అందం అద్భుతంగా మారితే ఆమెలా ఉంటుందేమో.. అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచేసిన చిన్నది. కానీ అదృష్టం మాత్రం కలిసిరాలేదు. దీంతో సౌత్ ఇండస్ట్రీలో అనుకున్నంతగా అవకాశాలు మాత్రం రాలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా..ఫాలోయింగ్ మాత్రం ఎక్కువగానే ఉంది. ఎవరో గుర్తుపట్టారా ?..

Tollywood: ఈ అందాల రాశి టాలీవుడ్ ముద్దుగుమ్మ.. యూత్ ఫేవరేట్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 17, 2023 | 8:15 PM

సినీతారలు షేర్ చేసే ప్రతి చిన్న పోస్ట్ కష్ణాల్లో సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. ఇక తమ అభిమాన హీరోహీరోయిన్స్ పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే త్రోబ్యాక్ ట్రెండింగ్ లో మీకోసం ఓ క్రేజీ పిక్ తీసుకువచ్చాం. పైన ఫోటోను చూశారు కదా.. ఆ అందాల రాశిని గుర్తుపట్టండి. అందం అద్భుతంగా మారితే ఆమెలా ఉంటుందేమో.. అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచేసిన చిన్నది. కానీ అదృష్టం మాత్రం కలిసిరాలేదు. దీంతో సౌత్ ఇండస్ట్రీలో అనుకున్నంతగా అవకాశాలు మాత్రం రాలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా..ఫాలోయింగ్ మాత్రం ఎక్కువగానే ఉంది. ఎవరో గుర్తుపట్టారా ?.. తనే హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్.

1993 ఏప్రిల్ 5న దర్శకుడు ప్రియదర్శన్, నటి లిస్సి దంపతుల కుమార్తె. న్యూయార్క్ లో ఆర్కిటెక్చ్ర కోర్స్ పూర్తి చేసింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2017లో విడుదలైన హలో సినిమాతో కథానాయికగా పరిచయమైంది. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. కానీ నటనపరంగా ప్రశంసలు అందుకుంది కళ్యాణి. ఆ తర్వాత చిత్రలహరి, రణరంగం, హ్రిదయం చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో ఈ అమ్మడి చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ ఫాలోయింగ్ మాత్రం ఎక్కువగానే ఉంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ బ్యూటీ అరెల్ మైకిల్ ఫాతిమా చిత్రంలో నటించింది. మను సి కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. వచ్చే నెలలో ఈ చిత్రం అడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ ఫుట్ బాల్ కామెంటేటర్ గా కనిపించనుంది. అయితే తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి. నిత్యం సోషల్ మీడియాలో లేటేస్ట్ అప్డేట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది ఈ బ్యూటీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.