Kumari Srimathi OTT: ఓటీటీలో నిత్యామేన‌న్ తెలుగు వెబ్‌సిరీస్.. కుమారి శ్రీమ‌తి స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

సినిమాలు చేస్తూనే బ్రీత్‌.. ఇన్‌ టు ది షాడోస్‌, మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌ వంటి వెబ్‌ సిరీసుల్లోనూ మెరిసింది నిత్య. ఇప్పుడు 'కుమారి శ్రీమతి' అంటూ మరో ఆసక్తికర తెలుగు వెబ్‌ సిరీస్‌తో మన ముందుకు వస్తోంది. ఇందులో నిత్యా మేనన్‌ తో పాటు గౌతమి, మురళి మోహన్‌. నిరుపమ్‌, తిరువీర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Kumari Srimathi OTT: ఓటీటీలో నిత్యామేన‌న్ తెలుగు వెబ్‌సిరీస్.. కుమారి శ్రీమ‌తి స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Nithya Menen
Follow us
Basha Shek

|

Updated on: Sep 18, 2023 | 8:53 PM

మలయాళ ముద్దుగుమ్మ నిత్యామేనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుమారు 13 ఏళ్ల క్రితం నాని అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైందీ అందాల తార. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఇష్క్‌, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి, రుద్రమదేవి, జనతా గ్యారేజ్‌, గమనం, భీమ్లా నాయక్‌ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైంది. అలాగే కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకులను మెప్పించింది. సినిమాలు చేస్తూనే బ్రీత్‌.. ఇన్‌ టు ది షాడోస్‌, మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌ వంటి వెబ్‌ సిరీసుల్లోనూ మెరిసింది నిత్య. ఇప్పుడు ‘కుమారి శ్రీమతి’ అంటూ మరో ఆసక్తికర తెలుగు వెబ్‌ సిరీస్‌తో మన ముందుకు వస్తోంది. ఇందులో నిత్యా మేనన్‌ తో పాటు గౌతమి, మురళి మోహన్‌. నిరుపమ్‌, తిరువీర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొత్తం 7 ఎపిసోడ్లుగా సాగే కుమారి శ్రీమతి వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశారు మేకర్స్‌. సెప్టెంబ‌ర్ 28 న‌ అమెజాన్ ప్రైమ్‌ లో ఈ వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.

గోమ‌టేష్ ఉప‌ధ్యాయ్ దర్శకత్వం వహించిన కుమారి శ్రీమతి వెబ్‌ సిరీస్‌ తెలుగుతో పాటు మ‌ల‌యాళం, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే రిలీజైన ఈ టీజర్‌ సిరీస్‌పై ఆసక్తిని పెంచింది. ‘అబ్దుల్ కలాం అంట.. రజనీకాంత్ అంట.. తర్వాత ఈవిడే నంట.. ఉద్యోగం సద్యోగం చేయదంట.. బిజినెస్‌ మాత్రమే చేస్తాదంట.. కుటుంబాన్ని మొత్తం ఈవిడే లాక్కోస్తుందట. పెళ్లి గిళ్లీ వద్దంట వదిన. ఇట్టానే ఉండిపోద్దట’ అని టీజర్‌లో వచ్చే డైలాగ్‌ను బట్టే చెప్పవచ్చు ఇది ఓ మహిళా సాధికారతకు సంబంధించిన వెబ్‌ సిరీస్‌ అని. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావ‌రి బ్యాక్‌డ్రాప్‌లో కుమారి శ్రీమ‌తి వెబ్‌సిరీస్ కథ సాగనుందని సమాచారం. త్వరలోనే ఈ తెలుగు వెబ్‌ సిరీస్‌కు సంబంధించి మరిన్ని అప్డేట్స్‌ విడుదల చేయనున్నారు మేకర్స్‌. కుమారి శ్రీమతితో పాటు మాస్ట‌ర్ పీస్ అనే ఓ మ‌ల‌యాళ వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది నిత్యామేన‌న్ .అలాగే తిరు తర్వాత ధ‌నుష్ 50వ సినిమాలోనూ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తుంది.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!