- Telugu News Photo Gallery Cricket photos Ravichandran Ashwin: Team India All Rounder Records And Love Story With Wife Prithi Ashwin
R Ashwin: అశ్విన్, ప్రీతిల ప్రేమకథ ఎలా మొదలైందో తెలుసా? టీమిండియా స్పిన్నర్ లవ్ ప్రపోజల్ అలా చేశాడా?
రవిచంద్రన్ అశ్విన్.. క్రికెట్ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు. ఆఫ్ స్నిన్నర్‌గా భారత క్రికెట్ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడీ క్రికెటర్. వ్యక్తిగతంగానూ ఎన్నో రికార్డులు అందుకున్నాడు. భారత క్రికెట్‌లో మేటి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అశ్విన్ ఆదివారం (సెప్టెంబర్ 17) న పుట్టిన రోజు జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా అశ్విన్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌లోని కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.
Updated on: Sep 17, 2023 | 10:43 PM

అశ్విన్ క్రికెట్ ప్రపంచం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. అతని భార్య ప్రీతి ఇటీవల అశ్విన్‌తో తన ప్రేమ కథ గురించి కొన్ని ఆలోచనలను పంచుకుంది. జియో సినిమా హ్యాంగ్‌అవుట్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ప్రీతి అశ్విన్ చిన్నప్పటి నుంచి తనకు తెలుసని, ఒకే స్కూల్‌లో చదువుకున్నామని తెలిపింది.

'మేం చిన్నప్పుడు ఒకే స్కూల్‌కి వెళ్లేవాళ్లం. పెళ్లికి ముందే మేం ఒకరికొకరం తెలుసు. స్కూల్ డేస్ నుంచి పెద్దవాళ్లయ్యే వరకు మేం కలిసి పెరిగాం' అని ప్రీతి అశ్విన్ చెప్పింది. అశ్విన్‌కి, నేను మంచి స్నేహితుమని అందరికీ తెలుసు. అయితే క్రికెట్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశంతో ఆశ్విన్ వేరే చోటికి వెళ్లాడు. అయినప్పటికీ, మేము ఒకరినొకరు పుట్టినరోజులు, కుటుంబ వేడుకలు, ప్రత్యేక సందర్భాల్లో కలుస్తూనే ఉన్నాం

చాలా కాలం తర్వాత అశ్విన్ ఒకరోజు నన్ను కలిశాడు. అప్పుడు నేను చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అకౌంటెంట్‌గా పని చేస్తున్నాను. అక్కడి నుంచి మా బంధం మరింత బలపడిందని ప్రీతి చెబుతోంది. అశ్విన్ ప్రపోజల్ గురించి మాట్లాడుతూ.. 'ఒకరోజు అశ్విన్ నన్ను నేరుగా క్రికెట్ గ్రౌండ్‌కి తీసుకెళ్లాడు. ఈ జీవితం ఉన్నంత కాలం నిన్ను ప్రేమించాలని ఉంది' అని ప్రపోజ్ చేశాడని తెలిపింది ప్రీతి.

అశ్విన్ ప్రపోజల్ కి ఓకే చెప్పిన ప్రీతీ 2011 నవంబర్ 13న పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వారికి అఖిరా, ఆధ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అశ్విన్ ప్రస్తుతం భారత్ తరఫున టెస్ట్ క్రికెట్‌లో మాత్రమే కనిపిస్తున్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ జట్టుకు ఆడుతున్నాడు.