IND vs SL: ప్రేమదాసలో చరిత్ర సృష్టించిన సిరాజ్.. దెబ్బకు ఆ దిగ్గజాల రికార్డులు గల్లంతు..
కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. ముఖ్యంగా హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగాడు. సిరాజ్ బుల్లెట్లాంటి బంతులకు లంకేయుల దగ్గర సమాధానం లేకుండా పోయింది. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు పెవిలియన్ చేరుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 7 ఓవర్లు వేసిన సిరాజ్ 21 పరుగులిచ్చి 6 వికెట్ల పడగొట్టాడు. వన్డే కెరీర్ బెస్ట్ సాధించిన సిరాజ్ గతంలో ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన మలింగ రికార్డును సమం చేశాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
