AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arha: వాట్ ఏ ట్యాలెంట్.. మట్టితో బుజ్జి గణపతిని తయారు చేసిన అల్లు అర్జున్‌ కుమార్తె.. వైరల్‌ వీడియో

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గణేశ్‌ చతుర్థి హడావిడి మొదలైంది. ఊరూరా, వాడవాడా గణనాథుడి విగ్రహాలు కొలువుదీరాయి. ఇక చిన్నపిల్లలు కూడా వినాయక చవితిని ఎంతో ఆనందంతో సెలబ్రేట్‌ చేసుకుంటారు. చిన్న చిన్న గణపతులను తయారుచేసి తమ ముచ్చటను తీర్చుకుంటారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ గారాల పట్టి అల్లు అర్హ బుజ్జి గణనాథుడిని తయారుచేసింది. అది కూడా మట్టితో. తన చిట్టి చేతులతో ఎంతో శ్రద్ధగా, ఓపికతో విగ్రహాన్ని తయారుచేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.

Allu Arha: వాట్ ఏ ట్యాలెంట్.. మట్టితో బుజ్జి గణపతిని తయారు చేసిన అల్లు అర్జున్‌ కుమార్తె.. వైరల్‌ వీడియో
Allu Arjun Family
Basha Shek
|

Updated on: Sep 17, 2023 | 7:43 PM

Share

మనదేశంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే పండగల్లో వినాయక చవితి ఒకటి. సామాన్యులు, సెలబ్రిటీలనే సంబంధం లేకుండా అందరూ ఈ పండగను ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారు. ఈ ఏడాది సోమవారం (సెప్టెంబర్‌ 18) ఈ పర్వదినాన్ని సెలబ్రేట్‌ చేసుకోనున్నారు. వేడుకల్లో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా గణనాథులు కొలువుదీరాయి. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గణేశ్‌ చతుర్థి హడావిడి మొదలైంది. ఊరూరా, వాడవాడా గణనాథుడి విగ్రహాలు కొలువుదీరాయి. ఇక చిన్నపిల్లలు కూడా వినాయక చవితిని ఎంతో ఆనందంతో సెలబ్రేట్‌ చేసుకుంటారు. చిన్న చిన్న గణపతులను తయారుచేసి తమ ముచ్చటను తీర్చుకుంటారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ గారాల పట్టి అల్లు అర్హ బుజ్జి గణనాథుడిని తయారుచేసింది. అది కూడా మట్టితో. తన చిట్టి చేతులతో ఎంతో శ్రద్ధగా, ఓపికతో విగ్రహాన్ని తయారుచేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అల్లు అర్హ ట్యాలెంట్‌ను చూసి అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అల్లు అర్హ ఇప్పటికే స్టార్‌ కిడ్‌గా సోషల్‌ మీడియాలో ఫుల్‌ క్రేజ్‌ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తన ముద్దు ముద్దు మాటలతో అర్హ చెప్పిన డైలాగ్స్‌, డ్యాన్స్‌ వీడియోలు నెటజన్లను బాగా ఆకట్టుకుంటాయి. అల్లు అర్హ ఫొటోలు, వీడియోలను స్నేహలతా రెడ్డి తరచూ సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

సోషల్‌ మీడియాలో క్రేజ్‌ తెచ్చుకున్న అల్లు అర్హ ఇప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌పైనా సందడి చేస్తోంది. ఇటీవల సమంత నటించిన పీరియాడికల్‌ మూవీ శాకుంతంలో అల్లు అర్హ నటించింది. ఇందులో తను పోషించిన భరతుడి పాత్రకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. పలువురి ప్రశంసలు కూడా దక్కాయి. శాకుంతలం సినిమా నిరాశపర్చినా అల్లు అర్హకు మాత్రం ఫుల్‌ క్రేజ్‌ వచ్చింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ దేవర సినిమాలోనూ అల్లు అర్హ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో జాన్వీ చిన్ననాటి రోల్‌ కోసం అర్హను ఎంపిక చేసుకున్నారట. ఇందుకోసం భారీ రెమ్యునరేషన్‌ను కూడా ముట్టజెప్పారట. అయితే దీనిపై దేవర మూవీ మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప సీక్వెల్‌ షూటింగ్‌లో బిజీగా ఉంటున్నాడు. పుష్ప సినిమాలో నటనకు గానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడంతో ఈ సీక్వెల్‌పై మరిన్ని అంచనాలు పెరిగాయి. సుకుమార్‌ తెరకెక్కిస్తోన్న ఈ మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.

ఇవి కూడా చదవండి

మట్టి గణపతిని తయారుచేస్తోన్న అల్లు అర్హ

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..