AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jawan OTT: కొత్త సీన్స్‌తో’జవాన్‌’ ఓటీటీ రిలీజ్‌.. ఆ స్పెషల్‌ డే రోజునే స్ట్రీమింగ్‌!

బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ సినిమా బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ తో దూసుకెలుతోంది. సెప్టెంబర్‌ 7న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ షారుక్‌ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. మొత్తం 10 రోజులకు కలిపి ప్రపంచ వ్యాప్తంగా 797.50 కోట్ల వసూళ్లు వచ్చినట్లు జవాన్‌ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. సౌతిండియన్‌ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వం వహించిన జవాన్‌ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది.

Jawan OTT: కొత్త సీన్స్‌తో'జవాన్‌' ఓటీటీ రిలీజ్‌.. ఆ స్పెషల్‌ డే రోజునే స్ట్రీమింగ్‌!
Jawan Movie
Basha Shek
|

Updated on: Sep 17, 2023 | 9:06 PM

Share

బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ సినిమా బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ తో దూసుకెలుతోంది. సెప్టెంబర్‌ 7న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ షారుక్‌ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. మొత్తం 10 రోజులకు కలిపి ప్రపంచ వ్యాప్తంగా 797.50 కోట్ల వసూళ్లు వచ్చినట్లు జవాన్‌ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. సౌతిండియన్‌ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వం వహించిన జవాన్‌ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. దీపికా పదుకొనే, ప్రియమణి, విజయ్ సేతుపతి, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగిబాబు తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. షారుక్‌ సొంత బ్యానర్‌ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై గౌరీఖాన్‌ జవాన్‌ సినిమాను నిర్మించారు. అనిరుధ్‌ స్వరాలు సమకూర్చారు. థియేటర్లలో సందడి చేస్తోన్న జవాన్‌ సినిమా ఓటీటీ రిలీజ్‌ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ విషయంపై డైరెక్టర్‌ స్పందించారు. షారుక్‌ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్‌ అందించారు. ‘సరైన రన్‌ టైమ్‌, ఎమోషనల్‌ సీన్లతో జవాన్‌ సినిమాను థియేటర్లలో విడుదల చేశాం. అయితే ఓటీటీ రిలీజ్‌కు వచ్చే సరికి ఇంకొన్ని సీన్లు యాడ్‌ చేయాలనుకుంటున్నాం. అందుకే హాలీడేకు వెళ్లకుండా ఇప్పుడు దీనిపైనే వర్క్‌ చేస్తున్నాను. ఓటీటీలో జవాన్‌ సినిమా కచ్చితంగా మిమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేస్తుంది.’అని చెప్పుకొచ్చారు డైరెక్టర్‌ అట్లీ. అయితే జవాన్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్ ఎప్పుడనే దానిపై మాత్రం ఆయన స్పందించలేదు.

షారుక్‌ జవాన్‌ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఇందుకోసం సుమారు రూ. 250 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ఇక నవంబర్ మొదటి వారంలో జవాన్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. అలాగే దీపావళి కానుకగా కూడా ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌ లో రిలీజ్ చేసే ఛాన్సు ఉందని సమాచారం. ఇక జవాన్‌ తో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు అట్లీ. దీని తర్వాత ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన అట్లీ ‘అల్లు అర్జున్‌, నేను మంచి స్నేహితులం. సినిమా విషయంలో మాకు కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలున్నాయి. ఒక సినిమా రెడీ కావాలంటే దేవుడి ఆశీస్సులు కూడా చాలా అవసరం. కాబట్టి వాటి కోసం వేచి చూద్దాం’ అని చెప్పారు అట్లీ.

ఇవి కూడా చదవండి

దీపావళి కానుకగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..