Varun Tej:పెళ్లికి ముందే అత్తారింట్లో లావణ్య.. వరుణ్‌తో కలిసి వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోస్‌ చూశారా?

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్ ఇంట్లోనూ వినాయక చవితి వేడుక ఘనంగా జరిగింది. వరుణ్‌కు కాబోయే భార్య, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి కూడా ఈ పూజల్లో పాల్గొనడం విశేషం. మెగా బ్రదర్‌ నాగబాబు, పద్మజతో కలిసి పూజలో పాల్గొన్నారు వరుణ్‌- లావణ్య. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్నారీ లవ్‌ బర్డ్స్‌. వరుణ్‌ గ్రీన్‌ కుర్తాలో ముస్తాబు కాగా, చీరలో లావణ్య ఎంతో అందంగా కనిపించింది. త

Varun Tej:పెళ్లికి ముందే అత్తారింట్లో లావణ్య.. వరుణ్‌తో కలిసి వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోస్‌ చూశారా?
Varun Tej, Lavanya Tripathi
Follow us

|

Updated on: Sep 18, 2023 | 7:40 PM

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతునాయి.. ఊరూరా, వాడవాడలా కొలువు దీరిన గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ గణేష్ చతుర్థి సందడి మాములుగా లేదు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తమ ఇళ్లల్లో వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు జరుపుతున్నారు. ఇక టాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా వినాయక చవితి పండగను అట్టహాసంగా జరుపుకొంటున్నారు. వినాయకుడికి పూజలు చేసి ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీలో గణేష్‌ చతుర్థి సెలబ్రేషన్స్‌ ఘనంగా జరిగాయి. తన మనవరాలు క్లింకారా కొణిదెలతో కలిసి వినాయకుడికి పూజలు చేశారు చిరంజీవి. రామ్‌చరణ్, ఉపాసన, సురేఖ, అంజనా దేవి, శ్రీజ తదితరులు ఈ వేడుకల్లో సందడి చేశారు. ఇక మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్ ఇంట్లోనూ వినాయక చవితి వేడుక ఘనంగా జరిగింది. వరుణ్‌కు కాబోయే భార్య, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి కూడా ఈ పూజల్లో పాల్గొనడం విశేషం. మెగా బ్రదర్‌ నాగబాబు, పద్మజతో కలిసి పూజలో పాల్గొన్నారు వరుణ్‌- లావణ్య. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్నారీ లవ్‌ బర్డ్స్‌. వరుణ్‌ గ్రీన్‌ కుర్తాలో ముస్తాబు కాగా, చీరలో లావణ్య ఎంతో అందంగా కనిపించింది. తమ ఇంట్లో జరిగిన వినాయక చవితి సెలబ్రేషన్స్‌ ఫొటోలను వరుణ్‌ తేజ్‌ సోషల్‌ మీడియాలో చేశాడు. ‘ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ ఆరోగ్యం, సౌభాగ్యం ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. నిహారిక కొణిదెల నిన్ను మిస్‌ అవుతున్నా’ అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌ ఇచ్చాడు వరుణ్‌.

ప్రస్తుతం వరుణ్‌ షేర్‌ చేసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఎంగేజ్‌మెంట్ జరిగిన చాలా రోజుల తర్వాత వరుణ్‌, లావణ్య ఒకే చోట దర్శనమివ్వడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాబోయే దంపతులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక వరుణ్‌- లావణ్యల పెళ్లి ముహూర్తం కూడా దగ్గర పడిందని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న ప్రేమ పక్షులు నవంబర్‌ 1న పెళ్లిపీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇటలీ వేదికగా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ జరగనుందని టాక్‌ వినిపిస్తోంది. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు, స్నేహితులు మాత్రమే వరుణ్‌-లావణ్యల వివాహానికి హాజరుకానున్నారని తెలుస్తోంది. అయితే పెళ్లిపై అటు వరుణ్‌, ఇటు లావణ్య కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు ఇటీవలే జంటగా షాపింగ్‌ చేస్తూ కనిపించారు వరుణ్‌- లావణ్య.

ఇవి కూడా చదవండి

వరుణ్ తేజ్ ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు