AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Waltair Veerayya: మెగా మాస్ జాతర.. రచ్చే లేపిన వీరయ్య.. ట్రైలర్ అదుర్స్

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమానుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ వచ్చేసింది. మెగాస్టార్ తో పాటు మాస్ మహారాజ రవితేజ నటిస్తోన్న ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. 

Waltair Veerayya: మెగా మాస్ జాతర.. రచ్చే లేపిన వీరయ్య.. ట్రైలర్ అదుర్స్
Waltair Veerayya
Rajeev Rayala
|

Updated on: Jan 07, 2023 | 6:17 PM

Share

అతనొస్తే పూనకాలన్నారు…? అడుగేస్తే అరాచకం అన్నారు..? మరేంటి ఇంకా సౌండే లేదేంటని అనుకుంటున్నారా..? అయితే అలాంటి వారికి దిమ్మతిరిగే అప్డేట్ ఇచ్చారు వాల్తేరు వీరయ్య. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమానుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ వచ్చేసింది. మెగాస్టార్ తో పాటు మాస్ మహారాజ రవితేజ నటిస్తోన్న ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లిమ్ప్స్, సాంగ్స్ , పోస్టర్స్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. సంక్రాతి పండగ.. పరుగెత్తుకుంటూ వస్తున్న వేళ.. సినిమా రిలీజ్‌ డేట్ మరింత దగ్గరకొచ్చిన వేళ…! జాన్ 8న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ అంటూ ఇటీవలే డేట్ అనౌన్స్ చేశారు. ఆ హాడావిడిలోనే ఎట్ ప్రజెంట్ ఉన్నారు వీరయ్య. అయినా తన ఫ్యాన్స్ కోసం వారి ఎంటర్‌ టైన్మెంట్ కోసం.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

మెగా అభిమానులు.. మాస్ రాజా ఫ్యాన్స్ కోరుకునే అని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. చాలా కాలం తర్వాత మెగాస్టార్ కంప్లీట్ మాస్ రోల్ లో కనిపించనున్నారు. రవితేజ కూడా మెగాస్టార్ కు గట్టి పోటీ ఇస్తూ తనదైన స్టైల్ లో నటించి ఆకట్టుకోనున్నారు. అలాగే డైలాగులు కూడా ఆకట్టుకున్నాయి. వాడు నా ఎర.. నువ్వే నా సొర, రికార్డులో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డులు ఉంటాయి.. అంటూ చిరంజీవి చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి. ఇక రవితేజ చెప్పిన సరైన వేటగాడు లేక ఇక్కడ ఒక పులి పూనకంతో ఊగిపోతుందట.. అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇరాక్ ట్రైలర్ చివరిలో చిరంజీవి సినిమాలోని డైలాగ్ రవితేజ.. రవితేజ సినిమాలోని డైలాగ్ చిరంజీవి చెప్పడం ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

ఇక ఈ మూవీలో యాక్షన్స్ సీన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్ తో పాటు .. ఇద్దరూ కలసి అలరించిన పూనకాలు లోడింగ్ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అల్బమ్ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Follow Us
గోల్డ్‌లో పెట్టుబడి పెట్టేవారికి సడెన్ షాక్
గోల్డ్‌లో పెట్టుబడి పెట్టేవారికి సడెన్ షాక్
కీళ్ల నొప్పులకు వాతావరణ మార్పులే కారణమా? తెలుసుకోవాల్సిన విషయాలు
కీళ్ల నొప్పులకు వాతావరణ మార్పులే కారణమా? తెలుసుకోవాల్సిన విషయాలు
పేదరికం నుండి ధనవంతులుగా మారడానికి సైకాలజీ చెబుతున్న సీక్రెట్
పేదరికం నుండి ధనవంతులుగా మారడానికి సైకాలజీ చెబుతున్న సీక్రెట్
మీఫోన్ నెంబర్‌లోని చివరి రెండు అంకెలు తెలుసా?
మీఫోన్ నెంబర్‌లోని చివరి రెండు అంకెలు తెలుసా?
టీడీపీకి 3, జనసేనకు 1 రాజ్యసభ సీటు ఖరారు:
టీడీపీకి 3, జనసేనకు 1 రాజ్యసభ సీటు ఖరారు:
పదేపదే తలనొప్పి వస్తుందా? సకాలంలో గుర్తిస్తే ప్రమాదం తప్పుతుంది
పదేపదే తలనొప్పి వస్తుందా? సకాలంలో గుర్తిస్తే ప్రమాదం తప్పుతుంది
ఓవర్‌థింకింగ్‌కు చెక్ పెట్టే 3 మైండ్ బ్లోయింగ్ సైకాలజీ ట్రిక్స్
ఓవర్‌థింకింగ్‌కు చెక్ పెట్టే 3 మైండ్ బ్లోయింగ్ సైకాలజీ ట్రిక్స్
స్మార్ట్‌ఫోన్ వ్యసనంతో కొత్త ముప్పు.. వేగంగా పెరుగుతున్న ఆ వ్యాధి
స్మార్ట్‌ఫోన్ వ్యసనంతో కొత్త ముప్పు.. వేగంగా పెరుగుతున్న ఆ వ్యాధి
వాస్తు టిప్స్ : ఇంట్లో కలబంద మొక్క పూయడం మంచిదేనా?
వాస్తు టిప్స్ : ఇంట్లో కలబంద మొక్క పూయడం మంచిదేనా?
మిమ్మల్ని సక్సెస్ ట్రాక్ ఎక్కించే మార్నింగ్ హాబిట్స్..
మిమ్మల్ని సక్సెస్ ట్రాక్ ఎక్కించే మార్నింగ్ హాబిట్స్..