ఆనంద్ సినిమాను మిస్సైన హీరోయిన్.. క్రేజ్ మరోలా ఉండేది కదా అమ్మడు.. 

Rajitha Chanti

Pic credit - Instagram

04 June 2026

టాలీవుడ్ క్లాసిక్ సినిమాల్లో 'ఆనంద్' ఒకటి. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఇప్పటికీ మంత్రముగ్ధులను చేస్తుంది.

ఈ చిత్రంలో కథానాయికగా కమలినీ ముఖర్జీ తన సహజమైన నటనతో 'రూప' పాత్రకు ప్రాణం పోశారు. ఈ రోల్ మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. 

ఈ పాత్రకు మొదట దర్శకుడు శేఖర్ కమ్ముల మరొక హీరోయిన్‌ను అనుకున్నారనే విషయం చాలా మందికి తెలియదు. ఆమె మరెవరో కాదు'జయం' ఫేమ్ సదా

శేఖర్ కమ్ముల 'ఆనంద్' సినిమాను ప్రారంభించేటప్పుడు, ఆ పాత్రకు అమాయకత్వం, పరిణతి కలగలిసిన ఒక నటి కావాలని భావించారట.

ఆ సమయంలో 'జయం' సినిమాతో సదా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటన, కళ్ళలోని భావం శేఖర్ కమ్ములకు బాగా నచ్చింది.

 ఆయన మొదటగా 'రూప' పాత్ర కోసం సదాను సంప్రదించారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ సదాకు దక్కలేదు. ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత, కొత్త ముఖాల కోసం వెతికిన శేఖర్ కమ్ముల, కమలినీ ముఖర్జీని ఎంపిక చేశారు. ఆ నిర్ణయం ఈ సినిమాను ఒక క్లాసిక్ హోదాకు తీసుకువెళ్లింది.

సినిమా ప్రపంచంలో ఇలాంటి మార్పులు సర్వసాధారణం. పాత్ర కోసం ఎంపిక చేసుకునే నటీనటులు ఆ సినిమా ఫలితాన్ని పూర్తిగా మార్చేస్తుంటారు.