AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్నప్పుడు చాలా క్యూట్‌గా, చబ్బీగా ఉండేవాడు.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..

ఒకప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ విజయశాంతి. అప్పట్లో స్టార్ హీరోలకు మించిన క్రేజ్.. పారితోషికంతో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు.

చిన్నప్పుడు చాలా క్యూట్‌గా, చబ్బీగా ఉండేవాడు.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..
Vijayashanti
Rajeev Rayala
|

Updated on: Jun 04, 2026 | 7:16 PM

Share

43 సంవత్సరాల సినీ రంగ ప్రస్థానం, 25 సంవత్సరాల రాజకీయ జీవితంతో రాణిస్తున్నారు విజయశాంతి, లేడీ సూపర్ స్టార్ గా తెలుగు సినీచరిత్రలో పేరుగాంచారు. విజయశాంతి. ఆమె ముఖ్యంగా మహిళా ప్రాధాన్య పాత్రలకు జీవం పోసి, వాటి ద్వారా తనదైన ముద్ర వేశారు. సమాజంలో మహిళల పట్ల గౌరవం, శక్తివంతమైన పాత్రల రూపకల్పన ఆమె కెరీర్లో కీలక అంశాలుగా నిలిచాయి. సినీ రంగంలో ఆమె తొలి రెమ్యునరేషన్ రూ. 5,000 అక్కడి నుంచి మొదలైన ఆమె ప్రస్థానం రూ. 1 కోటి వరకు పెరిగిందని తెలిపారు విజయశాంతి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి పలు భాషల్లో నటించి, తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. రాజకీయాల్లోనూ ఆమె తనదైన శైలిలో రాణించారు. తన పాత్రల ద్వారా, రాజకీయ ప్రస్థానం ద్వారా సమాజానికి స్ఫూర్తిని అందించిన విజయశాంతి, తెలంగాణలో బలమైన వ్యక్తిత్వంగా గుర్తింపు పొందారు.

కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా సమయంలో జరిగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో విజయశాంతి, దర్శకుడు అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి, వారి అనుభవాల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. విజయశాంతి తన సినీ ప్రస్థానంలో మహేష్ బాబుతో తన తొలి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. 1988లో వచ్చిన కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో తాను మహేష్ బాబుతో కలిసి నటించానని పేర్కొన్నారు. ఆ సమయంలో మహేష్ బాబు వయస్సు సుమారు 13-14 సంవత్సరాలు ఉంటుందని, అతను చాలా క్యూట్‌గా, చబ్బీగా ఉండేవాడని ఆమె అన్నారు.

ఆ చిత్రంలోని ఒక సన్నివేశంలో చిన్నారి మహేష్‌ను కొట్టాల్సి వచ్చిందని, అయితే తన మనసు రాలేదని విజయశాంతి వివరించారు. ఎంత ప్రయత్నించినా కొట్టలేకపోయానని, చాలా టేకులు వెళ్లినట్లు తెలిపారు. అప్పటి దర్శకుడు, మహేష్ బాబు తండ్రి కృష్ణగారు స్వయంగా అమ్మా కొట్టండమ్మా అని చెప్పినా తన చెయ్యి పైకి లేవలేదని ఆమె వివరించారు. చివరకు చిన్నారి మహేష్ బాబు పర్వాలేదు ఆంటీ కొట్టండి అని చెప్పిన తీరు ఆమెకు ఇప్పటికీ గుర్తుందని అన్నారు. అలాంటి చిన్నపిల్లోడు ఈ రోజు సూపర్ స్టార్ అయ్యారని, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అతనితో కలిసి నటించడం నిజంగా ఊహించలేదని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. సరిలేరు నీకెవ్వరు సెట్‌లో మహేష్ బాబుతో పనిచేసిన అనుభవం గురించి మాట్లాడుతూ, ఒక సూపర్ స్టార్‌లా కాకుండా చాలా సాఫ్ట్‌గా, డౌన్ టు ఎర్త్‌గా ఉంటారని విజయశాంతి ప్రశంసించారు. పెద్దవారి పట్ల కృష్ణగారి మాదిరిగానే మహేష్ బాబు కూడా అపారమైన గౌరవం చూపుతారని, దర్శకులకు, ఇతర నటీనటులకు మర్యాద ఇస్తారని ఆమె పేర్కొన్నారు. మహేష్ బాబు అద్భుతమైన వ్యక్తిత్వం గలవారని ఆమె అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?