తిరుగులేని కమెడియన్.. చివరిరోజుల్లో చూడటానికి ఎవ్వరిని రానివ్వలేదు.. కారణం ఏంటో తెలుసా.?
ధర్మవరపు సుబ్రహ్మణ్యం తెలుగు సినిమాకు ఒక హాస్యనటుడిగా, రచయితగా, దర్శకుడిగా, గాయకుడిగా, విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా, రాజకీయ నాయకుడిగా బహుముఖ సేవలు అందించారు. తన ప్రతిభతో రేలంగి, బ్రహ్మానందం వంటి దిగ్గజాల లిస్ట్ లో చేరిపోయారు. క్రమశిక్షణ, కుటుంబ విలువలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ధర్మవరపు, తన వృత్తి జీవితంలోనూ ఆదర్శంగా నిలిచారు.

ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాదు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కామెడీలో తనదైన శైలిలో పంచులతో నవ్వులుపూయించారు ధర్మవరపు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం కేవలం ఒక హాస్యనటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, గాయకుడిగా, విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా (వీడీవో), రాజకీయ నాయకుడిగా బహుముఖ ప్రతిభను ప్రదర్శించారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం ప్రకాశం జిల్లా, బల్లికురువ మండలం, కొమ్మినేనివారిపాలెంలో జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అద్దంకిలో జరిగింది. ఆ తర్వాత ఒంగోలులో కళాశాల విద్యను పూర్తి చేసుకున్నారు. చదువు పూర్తి కాకముందే తండ్రిని కోల్పోవడంతో, నలుగురు అన్నదమ్ములు, తల్లితో కలిసి కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యతను చూశారు. ఆయన కళా ప్రస్థానం నల్లూరు వెంకటేశ్వరరావు గారి శిక్షణలో నాటకాలతో ప్రారంభమైంది. ప్రజానాట్యమండలిలో ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చి కళాకారుడిగా గుర్తింపు పొందారు. కేవలం నటుడిగానే కాకుండా రచయితగా కూడా ఆయన తన ప్రతిభను చాటుకున్నారు.
ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో) కోసం “అనగనగా ఒక శోభ” వంటి ఎన్నో నాటకాలను రచించి, వాయిస్ ఓవర్ ఇచ్చారు. దూరదర్శన్ కోసం “ఆనందో బ్రహ్మ”, “పరమానంద శిష్యుల కథ” వంటి అనేక విజయవంతమైన కార్యక్రమాలను రూపొందించారు. తన స్నేహితుల ప్రోత్సాహంతో సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్లారు. అయితే, అక్కడ సరైన అవకాశాలు లభించకపోవడంతో, రెండు సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి వచ్చేశారు. సాధారణంగా సినీ వాతావరణానికి అలవాటు పడినవారు తిరిగి రావడం కష్టం, కానీ ధర్మవరపు తన మనసును నియంత్రించుకుని తిరిగి తన స్వస్థలానికి వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి, వీడీవోగా హైదరాబాద్‌లో ఉద్యోగం సాధించారు. ఉద్యోగం చేస్తూనే తన నాటక ప్రదర్శనలను కొనసాగించారు. ఆయన నాటక ప్రతిభను చూసిన దర్శకుడు జంధ్యాల, “జయంము నిశ్చయమురా” సినిమాతో సినీరంగంలోకి మళ్లీ ఆహ్వానించారు. గత అనుభవం వల్ల మొదట నిరాకరించినా, జంధ్యాల పట్టుదలతో ధర్మవరపు మళ్లీ సినీ రంగంలోకి ప్రవేశించారు. ఈ సినిమా తర్వాత ఆయన సినీ జీవితంలో వెనుతిరిగి చూడలేదు. “నువ్వు నేను”, “మన్మధుడు”, “అతడు”, “ధైర్యం”, “రెడీ”, “ఒక్కడు” వంటి అనేక చిత్రాలలో తన విలక్షణమైన హాస్యాన్ని, మేనరిజమ్స్‌ను ప్రదర్శించారు. ముఖ్యంగా తేజ దర్శకత్వంలో “నువ్వు నేను” చిత్రంలో ఎంఎస్ నారాయణతో ఆయన కాంబినేషన్, “అతడు”లో బ్రహ్మానందంతో పేస్ట్ సన్నివేశం ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.
ధర్మవరపు సుబ్రహ్మణ్యం కళతో పాటు క్రమశిక్షణకు, కుటుంబ విలువలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చేవారు. సినిమా షూటింగ్‌ల అనంతరం ఆరు గంటల తర్వాత కుటుంబంతో గడపడానికి సమయం కేటాయించేవారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం రెండు సార్లు చావు అంచులవరకు వెళ్లివచ్చారు.. ఒకేసారి రోడ్డు ప్రమాదంలో ఓ బస్సు ఆయన కారుపై నుంచి వెళ్ళింది.. ఆసమయంలో ఆయన కారులోనే ఇర్రుక్కుపోయారు. ఆ సమయంలో తీవ్రంగా గాయపడ్డారు.. ఆ తర్వాత సౌందర్య నటించిన శ్వేతనాగు సినిమా షూటింగ్ సమయంలో ఎదో పురుగు కొట్టడంతో శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి.. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆయన భార్య వెంటనే హాస్పటల్ లో చేర్పించడంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. ఆతర్వాత ఆయన జాండిస్ బారినపడ్డారు.. అది కాస్త క్యాన్సర్ గా మారింది. చనిపోయారు. ఆయన చివరి రోజుల్లో ఎవ్వరిని రానివ్వలేదు. ఎందుకంటే క్యాన్సర్ కారణంగా ఆయన చాలా బక్కగా అయిపోయారు. దాంతో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చివరి రోజుల్లో ఆయనను కలవడానికి ఎవ్వరిని రానివ్వలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
