AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: విమానంలో నుంచి అమాంతం దూకేసిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. వీడియో వైరల్

సాధారణంగా సినిమాల్లో హీరోలు రిస్కీలు స్టంట్స్ చేస్తుంటారు. ఇంకొందరు డూప్స్ తో మ్యానేజ్ చేస్తుంటారు. అయితే ఈ మధ్యన హీరోలే కాదు హీరోయిన్లు కూడా రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. అలా ట్రెండింగ్ లో ఓ టాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు పెద్ద సాహసమే చేసింది.

Tollywood: విమానంలో నుంచి అమాంతం దూకేసిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. వీడియో వైరల్
Tollywood Actress
Basha Shek
|

Updated on: May 14, 2025 | 11:05 AM

Share

సినిమాల్లో రిస్కీ స్టంట్స్ ఉంటే చాలా వరకు డూప్స్ తోనే షూట్ చేస్తారు. అయితే కొందరు హీరోలు డూప్ ల సహాయం లేకుండా ఈ స్టంట్స్ అన్నీ చేస్తుంటారు. బిల్డింగ్స్ మీద నుంచి దూకడాలు, రైళ్లు, విమానాలు, హెలికాఫ్టర్ల నుంచి అలవోకగా జంప్స్ చేస్తుంటారు. ఇప్పుడు హీరోలతో పాటు హీరోయిన్లు కూడా రిస్కీ స్టంట్స్ చేస్తుంటారు. సినిమాల్లో ఫైట్స్ చేయడమే కాదు అవసరమైతే విమానాలు, హెలికాప్టర్ల నుంచి కూడా దూకేస్తామంటున్నారు. అలా తాజాగా టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరోయిన్ డేరింగ్ స్టంట్ చేసింది. ప్రస్తుతం దుబాయ్ లో ఉంటోన్న ఈ అందాల తార అక్కడ విమానంలో నుంచి కిందకు దూకి స్కై డైవింగ్ చేసింది. ఆకాశంలో కిలోమీటర్ల ఎత్తులో చాలా సేపు విహరించి అనంతరం సేఫ్‌గా కిందకి దిగింది. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియలో షేర్ చేసింది. ‘ఒకటే లైఫ్, ఒకటే శ్వాస, ఒకటే జంప్’ అని క్రేజీ క్యాప్షన్‌ను జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘మగవాళ్లే ఇలాంటివి చేయాలంటే భయపడతారు. అలాంటిది ఓ అమ్మాయి ఇలాంటి సాహసం చేయడం గ్రేట్’ అంటూ తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇలా తన డేరింగ్ స్టంట్ తో అందరి మన్ననలు అందుకుంటోన్న ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు మిస్టర్ బచ్చన్ తో ఒక్కసారి సెన్సేషన్ అయిన భాగ్యశ్రీ బోర్సే. సినిమాలతో బిజీగా ఉండే ఈ అందాల తార ఇప్పుడు దుబాయ్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. అందులో భాగంగానే విమానంలో దూకి స్కై డైవింగ్ చేసింది.

ఇవి కూడా చదవండి

 వీడియో ఇదిగో..

మిస్టర్ బచ్చన్ మూవీ ఫ్లాప్ అయినా భాగ్యశ్రీకి అవకాశాలు మాత్రం వెల్లువలా వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండతో కలిసి ఈ బ్యూటీ నటించిన కింగ్ డమ్ త్వరలోనే విడుదల కానుంది. ప్రస్తుతం రామ్ పోతినేని రాపో22 సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటోంది భాగ్యశ్రీ. దీంతో పాటు దుల్కర్ సల్మాన్ ‘కాంత, ప్రభాస్- ప్రశాంత్ వర్మ మూవీ, సూర్య- వెంకీ అట్లూరి మూవీలోనూ ఈ ముద్దుగుమ్మనే హీరోయిన్ గా నటిస్తోంది.

భాగ్యశ్రీ గ్లామరస్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్