బాగా తిని బలిసి కొట్టుకుంటున్నాను అనుకోవద్దు.. స్టార్ నటుడు అంతమాటనేశాడేంటీ..!
ఆయన ఒకప్పుడు స్టార్ హీరో.. ఆయన సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూ కట్టేవారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన అంటే పడి చచ్చిపోయేవారు. అంతలా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ స్టార్ నటుడు. కానీ ఇప్పుడు విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

సాధారణంగా సోషల్ మీడియాలో హీరోయిన్స్ ఎక్కువగా సందడి చేస్తూ ఉంటారు. తమ సినిమా అప్డేట్స్ తో పాటు బ్రాండ్ ప్రమోషన్స్ , గ్లామరస్ ఫోటో షూట్స్ తో, అలాగే వెకేషన్ ట్రిప్స్ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ అందాల భామలు సందడి చేస్తుంటారు. ఇక హీరోల విషయానికొస్తే కొంతమంది మాత్రమే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సినిమా అప్డేట్స్ తో లేదంటే ఏదైనా అవైర్నెస్ వంటివి చేస్తూ ఉంటారు. కానీ ఓ హీరోగా గారు మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నారు. సినిమా అప్డేట్స్ తో పాటు నిత్యం ఆయన చేసే పనులను కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ తెగ సందడి చేస్తున్నారు. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.? ఒకప్పుడు స్టార్ హీరోగా నటించింది.. ఇప్పుడు విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి మెప్పిస్తున్నారు ఆయన. ఇంతకూ ఆయన ఎవరంటే..
ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ను తన నటనతో కట్టిపడేసి.. ఇప్పుడు విలన్ గా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు స్టార్ నటుడు జగపతిబాబు. జగపతి బాబుకు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో చెప్పక్కర్లేదు. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటాడు. తను వెళ్లిన వెకేషన్, డైట్, సినిమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటాడు. రోడ్డు సైడ్ ధాబాలో తినడం.. ఇంట్లో చేసే ఫుడ్ గురించి ఇలా అన్ని విషయాలను షేర్ చేసుకుంటాడు. జగపతి బాబు ఫోటోలకు, అతడు పంచుకునే విషయాలకు నెటిజన్స్ సైతం ఫిదా అవుతుంటారు.
తాజాగా ఆయన షేర్ చేసిన పోస్ట్ ఇప్పడు వైరల్ గా మారింది. ఈ పోస్ట్ లో ఆయన ఓ ఫుడ్ వీడియోను షేర్ చేశారు. “ఎప్పుడో ఆరు నెల్లకి ఒక్కసారి మా అమ్మాయి మాకు ఇచ్చే పండుగ.. రోజూ ఇలా తిని బలిసి కొట్టుకుంటున్నాను అనుకోవద్దు” అంటూ వీడియో షేర్ చేశారు జగపతి బాబు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. జగపతి బాబు ప్రస్తుతం విలన్ గా, తండ్రి పాత్రల్లో మెప్పిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.