AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెట్టింట చమక్కుమన్న తార.. మళ్లీ తెలుగులో ఎంట్రీ ఇవ్వండి మేడం.. ఫ్యాన్స్ రిక్వెస్ట్

తెలుగు చిత్రపరిశ్రమలో వరుస సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్, స్టార్ హీరోలతో నటించి పాపులర్ అయ్యింది. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి హీరోయిన గా ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాల్లో నటించి స్టార్ గా మారిపోయింది. ఇంతకూ ఆమె ఎవరంటే..

నెట్టింట చమక్కుమన్న తార.. మళ్లీ తెలుగులో ఎంట్రీ ఇవ్వండి మేడం.. ఫ్యాన్స్ రిక్వెస్ట్
Actress
Rajeev Rayala
|

Updated on: May 14, 2025 | 9:37 AM

Share

సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్స్ గా మారిపోతున్నారు.ఇప్పటికే ఎంతో మంది ముద్దుగుమ్మలు చిన్న వయసులోనే హీరోయిన్స్ గా అడుగు పెట్టారు. కానీ ఈ అమ్మడు మాత్రం అందరికన్నా చిన్న వయసులోనే హీరోయిన్ గా మారిపోయింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అంతే కాదు తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది. కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఆహా ఇలాంటి లవర్ మనకు ఉండాలి అని ప్రతి కుర్రాడు కలలు కనేలా చేసింది.. గతకొంతకాలంగా టాలీవుడ్ కు దూరంగా ఉంటుంది. ఇంతకూ ఆ అమ్మడు ఎవరో తెలుసా.?

పైన ఉన్న హీరోయిన్ ఓ పాలరాతి శిల్పం.. చూస్తేనే ప్రేమలో పడిపోతారు. ఇంతకూ ఆమె మరెవరో కాదు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ హన్సిక మోత్వానీ. ఈ ముద్దుగుమ్మ తెలుగులో దేశముదురు సినిమాతో హీరోయిన్ గ పరిచయం అయిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా.. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా చేస్తున్న సమయంలో హన్సిక వయసు కేవలం 15ఏళ్లు మాత్రమే.. అంతకు ముందు హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది.

దేశముదురు సినిమా తర్వాత కంత్రి,బిల్లా, మస్కా, కందిరీగ, పవర్, తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్, మై నేమ్ ఈజ్ శృతి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో సినిమాలు తగ్గించింది. ఎక్కువగా తమిళ్ హిందీ బాషల పైనే ఫోకస్ చేస్తుంది. కాగా హన్సిక మోత్వానీ వివాహం 2022 డిసెంబర్ 4న వ్యాపారవేత్త సొహైల్‌ కతూరియాతో రాజస్థాన్‌ జైపూర్‌లో వివాహం జరిగింది. సొహైల్‌ కు ఇది రెండో పెళ్లి కావడం విశేషం. ఇక సోషల్ మీడియాలో హన్సిక చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో కొన్ని ఫోటోలు పంచుకుంది. ఈ ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. కుర్రకారు ఈ పిక్స్ కు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వండి మేడం.. హీరోయిన్ ను ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!