ఏంటి మమ్మీ.. ఎవడీడు..!! థియేటర్‌లో నిమ్మకాయలు పట్టుకొని మహాదృష్ట అంటాడు..
కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కొన్ని సినిమాలు రిలీజ్ కంటే రీ రిలీజ్ లోనే కలెక్షన్స్ ఎక్కువ సాధించాయి. హిట్ సినిమాలే కాదు ఫ్లాప్ సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యి మెప్పించాయి. తమ ఫేవరేట్ హీరోల సినిమాలను మరోసారి థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ల హంగామా కనిపిస్తుంది. నిజానికి కొత్త సినిమాలు రిలీజ్ అయిన సాయంత్రానికే పైరసీ అయ్యి ఫోన్ లో వచ్చేస్తున్నాయి.. కానీ పాత సినిమాలు మాత్రం రీ రిలీజ్ అయ్యి థియేటర్స్ లో అదరగొడుతున్నాయి. నెలకు మూడు నాలుగు సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే దాదాపు అందరు హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే రీ రిలీజ్ సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషంగా రెస్పాన్స్ వస్తుంది. ప్రేక్షకులు సినిమాలను ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే.. థియేటర్స్ లో సినిమాలోని సీన్స్ ను రీ క్రియేట్ చేస్తున్నారు. మొదట్లో పాటలకు డాన్స్ లు వేసి వైరల్ చేశారు. ఆతర్వాత ఇప్పుడు సీన్స్ ను రీ క్రియేట్ చేస్తున్నారు.
మొన్నామధ్య మహేష్ బాబు నటించిన మురారి సినిమా సమయంలో ఏకంగా థియేట్సర్ లోనే పెళ్లి చేసుకున్నారు కొందరు. అంతే కాదు అక్షింతలతో సందడి చేశారు మరికొందరు. థియేటర్ మొత్తం పెళ్లి వైబ్ తీసుకొచ్చారు. అలాగే ఆరెంజ్ సినిమా సమయంలో సాంగ్స్ కు కోరసులు పాడి అదరగొట్టారు. ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీ రిలీజ్ అయ్యింది. ఈ ఎవర్ గ్రీన్ సినిమా చూడటానికి ఫ్యాన్స్ ఆత్రుత చూపించారు.
ఇదిలా ఉంటే థియేట్సర్ లో ఎవరైనా శ్రీదేవిలా గెటప్ వేసుకొని సందడి చేస్తారేమో అని అనుకుంటే .. ఊహించని విధంగా ఓ వ్యక్తి కనిపించాడు. పై ఫొటోలో ఉన్న వ్యక్తిని చూశారా..? జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో విలన్ అమ్రిష్ పూరీలా గెటప్ వేసుకొని నిమ్మకాయలు పట్టుకొని థియేట్సర్ లో సందడి చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండటంతో అభిమానులు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఎవడు మమ్మీ వీడు అటు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.