Tollywood: డబ్బులు లేక బైక్ గ్యారేజీలో పనిచేసి.. అప్పులు తీర్చేందుకు సినిమాల్లోకి.. ఇప్పుడు అతడి క్రేజ్ చూస్తే..
ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఓ సాధారణ కుర్రాడు ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. చిన్న చిన్న పాత్రలు పోషించిన అతుడు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇప్పుడు అతడి పేరు చెబితే అభిమానులకు పూనకాలే. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. ?

ప్రస్తుతం దక్షిణాదిలో అతడు స్టార్ హీరో. ఆయన సినిమాలు వస్తున్నాయంటే థియేటర్లలో జాతరే. అతడి కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూనే ఇటు తనకు ఇష్టమైన రంగాల్లో రాణిస్తున్నాడు. నటుడే కాదు.. అతడి బైక్ రేసర్.. అంతేకాకుండా విమానం నడిపే లైసెన్స్ ఉన్న ఏకైక హీరో. చిన్నప్పుడు ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు ఓ బైక్ గ్యారేజీలో పనిచేశాడు ఈ సికింద్రాబాద్ కుర్రాడు. ఆ తర్వాత బైక్, కార్ రేసింగ్ అంటే ఇష్టం ఉండడంతో అదే విషయాన్ని ఇంట్లో చెప్పాడు. కానీ తన కలలకు ఆర్థిక కష్టాలు అడ్డురావడంతో మోడలింగ్ రంగంలో చేరాడు. ఆ తర్వాత నెమ్మదిగా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు హీరోగా సత్తా చాటుతున్నారు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? అభిమానులు ముద్దుగా తల అని పిలుచుకుంటారు. అతడు మరెవరో కాదండి. హీరో అజిత్. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీతారలు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
అజిత్ కుమార్ 1971 మే 1న జన్మించాడు అజిత్. చిన్నప్పటి నుంచే ఆటోమొబైల్స్ పై విపరీతమైన ప్రేమ. దీంతో చదువు మధ్యలోనే ఆపేసి ఓ బైక్ గ్యారేజీలో పనిచేశాడు. ఇండస్ట్రీలోకి ఎప్పుడు రావాలని అనుకోలేదట అజిత్. మొదట్లో ఓ ప్రభుత్వరంగ సంస్థతోపాటు ఆటోమొబైల్ కంపెనీలో పనిచేశాడు. అదే సమయంలో కార్ రేసింగ్ పై ఆసక్తి ఏర్పడింది. అప్పుడు అజిత్ వయసు 18 సంవత్సరాలు. రేసింగ్ పై ఆసక్తి ఉందని తన తల్లిదండ్రులకు చెబితే.. మోటార్ స్పోర్ట్స్ చాలా ఖరీదైనదని.. తనకు ఏవిధంగానూ సాయం చేయలేమని చెప్పారట. కానీ తన ఆసక్తిని కాదనలేక.. తనకు కావాల్సింది తననే సాధించుకో అని చెప్పినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అజిత్. రేసింగ్ జరుగుతున్నప్పుడు ఓ వ్యక్తి తన దగ్గరకు వచ్చి మోడలింగ్ ట్రై చేయమని చెప్పడంతో అటువైపు అడుగులు వేశాడట. మోడలింగ్ లో వచ్చిన డబ్బును రేసింగ్ కోసం ఖర్చు చేసినట్లు తెలిపారు.
గతంలో తనను ఓ జర్నలిస్ట్ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి రీజన్ అడగ్గా..”నా వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పులు అయ్యాయి. అవి తీర్చడం కోసం ఇండస్ట్రీకి వచ్చానని” అజిత్ చెప్పాడట. తాను స్టార్ హీరోగా ఎదగాలని ఇండస్ట్రీలోకి రాలేదని.. తన అప్పులు తీర్చడానికి మాత్రమే నటుడిని అయ్యానని అన్నారు అజిత్. ఇటీవలే విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అజిత్ కు పద్మ భూషణ్ అవార్డ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..




