AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా నటించి.. ఇప్పుడు సిస్టర్ పాత్రలో ఆ స్టార్ హీరోయిన్..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బింబిసార సినిమాతో హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా చిరంజీవి అప్ కమింగ్ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరలవుతుంది.

Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా నటించి.. ఇప్పుడు సిస్టర్ పాత్రలో ఆ స్టార్ హీరోయిన్..
Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: May 01, 2025 | 11:29 AM

Share

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే మంచి హైప్ ఏర్పడింది. ఇందులో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ మూవీపై మరిన్ని అంచనాలు పెంచేశాయి. మరోవైపు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించినున్నట్లు టాక్. అంతేకాదు ఈ సినిమా కోసం నయనతార భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి సిస్టర్ రోల్ ఉందని.. ఈ పాత్ర చాలా ఎంటర్టైనింగ్ టోన్ లో సాగుతుందని అంటున్నారు. అయితే ఈ పాత్రలో సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయం ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. గతంలో చిరంజీవి, జ్యోతిక కలిసి ఠాగూర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో చిరు ప్రియురాలిగా, భార్యగా కనిపించింది జ్యోతిక. ఇప్పుడు చిరు సిస్టర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యిందని.. మరోవైపు ఈ చిత్రంలో చిరు యాస, బాడీ లాంగ్వేజ్ సరికొత్తగా డిజైన్ చేస్తున్నాడట అనిల్ రావిపూడి.

అలాగే ఈ సినిమాలో పూర్తిగా కామెడీపై దృష్టి సారిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ సరికొత్తగా స్టార్ట్ చేశారు అనిల్ రావిపూడి. ఈ మూవీలో ఆయా సన్నివేశాల గురించి అనిల్ తనకు చెబుతున్నప్పుడు కడుపుబ్బా నవ్వుతున్నానని గతంలో చెప్పుకొచ్చారు చిరు.

View this post on Instagram

A post shared by Jyotika (@jyotika)

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..