Tollywood: అప్పుడు సౌందర్య కొడుకుగా.. ఇప్పుడు హీరోగా.. ఈ చిన్నోడిని ఇప్పుడు చూస్తే..
సినీరంగంలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు తమదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. వరుసగా తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషలలో చాలామంది చిన్నప్పుడు సినిమాల్లో నటించి.. పెద్దయ్యాక హీరోగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడిప్పుడే వెండితెరపై హీరోగా సక్సెస్ అందుకున్నారు. ఇంతకీ ఈ చిన్నోడు గుర్తున్నాడా.. ?

తెలుగు సినీరంగంలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు తమ నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఒకప్పుడు సినిమాల్లో బాలనటులుగా కనిపించి మెప్పించారు. ఆ తర్వాత చదువుల కోసం సినిమాలకు దూరమై ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించిన చిన్నారులు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం తెలుగు సినీపరిశ్రమలో వరుస విజయాలు అందుకుంటూ హీరోహీరోయిన్లుగా క్రేజ్ అందుకుంటున్నవారు ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులే. ఇప్పటికే తేజా సజ్జా, కావ్య కళ్యాణ్ రామ్ తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే చైల్డా ఆర్టిస్ట్ చిన్నప్పుడే అద్భుతమైన నటన కనబరిచాడు. ఎన్నో హిట్ చిత్రాల్లో కనిపించి మెప్పించాడు. అతడే ఆనంద్ హర్షవర్దన్. మెగాస్టార్ చిరంజీవి, సౌందర్య, వెంకటేశ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించాడు.
ఆనంద్ హర్షవర్దన్… ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ చైల్డ్ ఆర్టిస్ట్. జగపతి బాబు, సౌందర్య, మహేశ్వరి కలిసి నటించిన ప్రియరాగాలు సినిమాలో సౌందర్య కొడుకుగా కనిపించాడు. ఈ మూవీలో ఆనంద్ నటన అద్భుతం. ఆ తర్వాత మీనా, వెంకటేశ్ కలిసి నటించిన సూర్యవంశం మూవీలోనూ కనిపించాడు. ఆనంద్ ప్రముఖ కంపోజర్, ప్లేబ్యాక్ సింగర్ పీబీ శ్రీనివాస్ మనవడు. బాలరామాయణం సినిమాలో వాల్మికీ, బాలహనుమాన్ పాత్రలు పోషించాడు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించాడు.
ఇక ఇప్పుడు హీరోగా మారాడు. జహాపన సినిమాతో హీరోగా వెండితెరపై అరంగేట్రం చేశాడు. తెలుగులో శ్రీమంజునాథ, ప్రియరాగాలు, ప్రేమించుకుందాం రా, పెళ్లి పందరి, సూర్యవంశం, మనసంతా నువ్వే, మావిడాకులు వంటి చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వరుస పోస్టులు షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటున్నాడు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..




