AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HIT 3 Movie Review : హిట్ 3 మూవీ రివ్యూ.. నాని ఊర మాస్ యాంగిల్.. క్లైమాక్స్ వేరేలెవల్..

నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ హిట్ 3. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా హిట్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి పెరిగిపోయింది. మరి హిట్ 3 ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుందా..? నాని మరోసారి నిర్మాతగా సక్సెస్ అయ్యాడా..? హీరోగా ఏం చేసాడు అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

HIT 3 Movie Review : హిట్ 3 మూవీ రివ్యూ.. నాని ఊర మాస్ యాంగిల్.. క్లైమాక్స్ వేరేలెవల్..
Hit 3 Movie
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Rajitha Chanti|

Updated on: May 01, 2025 | 9:16 AM

Share

మూవీ రివ్యూ: హిట్ 3

నటీనటులు: నాని, శ్రీనిథి శెట్టి, రావు రమేష్, సూర్య శ్రీనివాస్, శ్రీనాథ్ మాగంటి, బ్రహ్మాజీ తదితరులు

సంగీతం: మిక్కీ జే మేయర్

సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గేసే

ఎడిటర్: కార్తిక శ్రీనివాస్

నిర్మాత: నాని, ప్రశాంతి త్రిపురనేని

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: డా. శైలేష్ కొలను

నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ హిట్ 3. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా హిట్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి పెరిగిపోయింది. మరి హిట్ 3 ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుందా..? నాని మరోసారి నిర్మాతగా సక్సెస్ అయ్యాడా..? హీరోగా ఏం చేసాడు అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

అర్జున్ సర్కార్ (నాని) రూత్ లెస్ కాప్. 100 మంది అమాయకులు చచ్చినా పర్లేదు గానీ ఒక్క క్రిమినల్ మాత్రం బతక్కూడదు అనుకునే మనిషి. తన చేతికి దొరికిన క్రిమినల్స్‌కు నరకం చూపిస్తుంటాడు అర్జున్. అలాంటి క్రేజీ కాప్ చేతికి ఓ సైకో కిల్లర్ వస్తుంది. వరుసగా హత్యలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతుంటాడు. అలాంటి కేసులోకి అర్జున్ సర్కార్ వస్తాడు. వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి.. ఆ తర్వాత తన లాఠీకి పని చెప్తాడు. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు.. అతడి మోటో ఏంటి.. ఎందుకిలా హత్యలు చేస్తున్నాడు అనేది మిగిలిన కథ..

కథనం:

సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలో ఫ్రాంచైజీలు తక్కువే.. మన దగ్గర అంత మల్టీవర్స్ ఇంకా రాలేదు. కానీ దాన్నిప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నాడు నాని. తన హిట్ ఫ్రాంచైజీని ఆడియన్స్‌కు అలవాటు చేస్తున్నాడు. తాజాగా ఈ సిరీస్‌లో వచ్చిన థర్డ్ కేస్ హిట్ 3. ముందు నుంచే ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. పైగా ట్రైలర్ కూడా అదిరిపోవడం.. యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా నెక్ట్స్ లెవల్‌లో ఉండటంతో హిట్ 3 కోసం ఆసక్తిగా వేచి చూసారు ఆడియన్స్. వాళ్ల అంచనాలకు తగ్గట్లుగానే హిట్ 3 తెరకెక్కించాడు దర్శకుడు శైలేష్. ఫస్ట్ సీన్ నుంచే ఎక్కడా టైమ్ వేస్ట్ చేయకుండా కథ మొదలు పెట్టాడు. అర్జున్ సర్కార్ ఇంట్రో నుంచే మనోడి క్యారెక్టరైజేషన్ పక్కాగా ఎస్టిబ్లిష్ చేసాడు శైలేష్. క్రిమినల్స్‌తో ఆయన ఉండే తీరు చూస్తుంటే వణుకు వస్తుంది. అంత కిరాతకంగా ఉంటాడు అర్జున్ సర్కార్. అలాంటి పోలీస్ ఆఫీసర్ చేతికి సైకో కేసు వచ్చిన తర్వాత స్పీడ్ మరింత పెరిగింది. ఈ సినిమాలో చాగంటి ప్రవచనాలు భలే వాడుకున్నాడు దర్శకుడు శైలేష్. హీరో చేస్తున్న పనులను ఆయన ప్రవచనాలకు ముడిపెట్టిన తీరు బాగుంది. ఫస్టాఫ్ అంతా సైకో చేసే హత్యలు.. ఇన్వెస్టిగేషన్ తో వెళ్లిపోతుంది. చిన్నపిల్ల ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది. ఎమోషనల్‌గానూ ఈ సీన్ చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు శైలేష్. అక్కడక్కడా ఒళ్ళు గగ్గురుపొడిచే సీన్స్ కూడా ఉంటాయి.

ఓ వైపు సీరియస్ ట్రాక్ నడుస్తున్నపుడే.. మధ్య మధ్యలో నాని, శ్రీనిథి మధ్య సీన్స్ రాసుకున్నాడు శైలేష్. అవి కాస్త రీ ఫ్రెషింగ్‌గా అనిపిస్తాయి. ఇక సెకండాఫ్ అంతా ట్విస్టులు, టర్నులతో వెళ్లిపోయింది. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు అయితే నెక్ట్స్ లెవల్. హిట్ 1, 2 కేసులతో ఈ సినిమాను ముడిపెట్టిన విధానం ఆకట్టుకుంటుంది. అదేంటో స్క్రీన్ మీదే చూడాలి. ముందు నుంచి టీజర్, ట్రైలర్‌లో హైలైట్ చేసిన కోట్ సీన్స్ అయితే అదిరిపోయాయి. సైకోను పట్టుకునే సీన్స్ అన్నీ చాలా అద్భుతంగా వర్కవుట్ అయ్యాయి. ముఖ్యంగా ట్విస్టులు అలరిస్తాయి. సింపుల్ కథనే చాలా మలుపులు ఉండేలా రాసుకున్నాడు దర్శకుడు శైలేష్. క్లైమాక్స్‌లో నాని యాక్షన్ సీక్వెన్సులు చూస్తే భయమేస్తుంది. వామ్మో ఏంటిది ఇంత క్రూయల్‌గా ఉన్నాడు అనిపిస్తుంది. ఇన్నాళ్లూ మనం చూసిన నాని ఇతడేనా అనిపించేలా రెచ్చిపోయాడు నాని. అందుకే మధ్యలో ఓ డైలాగ్ కూడా పెట్టాడు.. ఇన్నాళ్లూ అదే అనుకుని మోసపోయారు జనం.. నేను చూపిస్తా ఒరిజినల్ అని..! దానికి తగ్గట్లుగానే ఉంటుంది హిట్ 3లో నాని క్యారెక్టరైజేషన్. పిల్లలకు పొరపాటున కూడా ఎంట్రీ లేదు.. వచ్చారా వణికిపోతారు. హిట్ 3ని వైలెంట్‌గా తీయాలని ఫిక్సైపోయినపుడే ఏ సర్టిఫికేట్‌కు రెడీ అయిపోయారు మేకర్స్. అందుకే ఎక్కడా దాపరికం లేకుండా చేయాలనుకున్న యాక్షన్ చేసేసారు. చాలా వరకు అది వర్కవుట్ అయింది కూడా. సెకండాఫ్ చాలావరకు స్క్విడ్ గేమ్ నుంచి స్ఫూర్తి పొందారు అని అర్థమవుతుంది.

నటీనటులు:

నాని గురించి కొత్తగా ఏం చెప్పాలి..? ఏ పాత్ర ఇస్తే అందులోకి దూరిపోతాడు అంతే. ఈసారి అర్జున్ సర్కార్‌గా విశ్వరూపం చూపించాడు. ఆయన యాక్టింగ్ జస్ట్ అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. శ్రీనిథి శెట్టి అలరించింది. ఉన్న చిన్న పాత్రతో మెప్పించింది. పైగా యాక్షన్ సీన్స్ కూడా చేసింది. హిట్ ఫ్రాంచైజీలో శ్రీనాథ్ మాగంటి మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. రావు రమేష్ క్యారెక్టర్ బాగుంది. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నికల్ టీం:

మిక్కీ జే మేయర్ సంగీతం అదిరిపోయింది. పాటలతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా సెట్ అయింది. సాను జాన్ వర్గేసే సినిమాటోగ్రఫీ బాగుంది. జమ్మూ కాశ్మీర్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్లేసెస్ బాగా ఎక్స్‌ప్లోర్ చేసారు. ఎడిటింగ్ ఓకే. కాస్త నిడివి ఎక్కువున్నట్లు అనిపిస్తుంది గానీ పెద్దగా కంప్లైంట్‌గా అనిపించదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు సైంధవ్‌తో నిరాశ పరిచిన శైలేష్ కొలను ఈసారి మాత్రం పకడ్బందీగా రాసుకున్నాడు కథ. ముఖ్యంగా హిట్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ వాడుకున్నాడు. సెకండాఫ్ సినిమాకు కీలకంగా మార్చేసాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా హిట్ 3.. అబ్‌కీ బార్ అర్జున్ సర్కార్..!

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..