Sree Vishnu : కన్నప్ప టీమ్‌కు క్షమాపణలు చెప్పిన శ్రీవిష్ణు.. ఆ డైలాగ్ తొలగింపు.. వీడియో వైరల్..
మంచు విష్ణు కన్నప్ప టీంకు హీరో శ్రీవిష్ణు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేస్తూ వివరణ ఇచ్చారు. ఇటీవల విడుదలైన సింగిల్ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని.. అదే సమయంలో ట్రైలర్ లో వచ్చిన కొన్ని డైలాగ్స్ కారణంగా కన్నప్ప టీమ్ హర్ట్ అయ్యిందని తెలిసిందని.. అది ఉద్దేశపూర్వకంగా చేయలేదని.. కానీ తప్పుగా అర్థమైందని అన్నారు.

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలను అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన లేటేస్ట్ సినిమా సింగిల్. అల్లు అరవింద సమర్పణలో డైరెక్టర్ కార్తిక్ రాజు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ లో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేసవి కానుకగా మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్ కు నెట్టింట పాజిటివ్ రివ్యూస్ రాగా.. అందులో శ్రీవిష్ణు చెప్పిన కొన్ని డైలాగ్స్ మాత్రం వివాదాస్పదమయ్యాయి. సింగిల్ ట్రైలర్ లో శ్రీవిష్ణు కొన్ని డైలాగ్స్ చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మంచు విష్ణు, రణబీర్ కపూర్ వరకు ఇలా చాలా మంది హీరోల హిట్ మూవీస్ డైలాగ్స్ వాడేశారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు నటిస్తోన్న కన్నప్ప సినిమాలోని శివయ్యా అనే డైలాగ్ సైతం చెప్పారు. ఇక చివర్లో మంచు కురిసిపోతుంది అనే డైలాగ్ సైతం వచ్చింది. దీంతో ఈ డైలాగ్స్ కాంట్రవర్సీకి దారి తీశాయి. తాజాగా ఈ వివాదంపై రియాక్ట్ అవుతూ ఓ వీడియోను షేర్ చేశారు హీరో శ్రీవిష్ణు.
“ఇటీవల విడుదలైన సింగిల్ ట్రైలర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో మేం వాడిన కొన్ని డైలాగ్స్ కారణంగా కన్నప్ప టీమ్ హర్ట్ అయ్యిందని తెలిసిందే. అందుకే ఈ వీడియో చేస్తున్నాం. అది కావాలని మేము ఇంటెన్షల్ గా చేసింది కాదు.. కానీ తప్పుగా కన్వే అయ్యింది. వెంటనే ఆ డైలాగ్స్ డిలీట్ చేశాం. అవి సినిమాలో కూడా ఉండవు. హర్ట్ చేద్దామనే ఉద్దేశంతో చేయలేదు. ప్రస్తుతం జనరేషన్ వాడే మీమ్స్, బయట వైరల్ అయ్యే ఇతర సినిమా రిఫరెన్స్ ఎక్కువగా తీసుకున్నాం. ఆ క్రమంలోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, అల్లు అరవింద్ ఇలా చాలా మంది డైలాగ్స్ ఉపయోగించాము. పాజిటివ్ గానే ఇవన్ని చేశాము. ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే సారి.. సింగిల్ టీమ్ తరపున క్షమాపణలు చెబుతున్నాం. ఇకపై అలాంటివి రాకుండా చూసుకుంటాము. ఇండస్ట్రీ మొత్తం ఒకే ఫ్యామిలీ. పొరపాటున ఇలాంటివి తప్పుగా అర్థమైనా సారి” అంటూ చెప్పుకొచ్చారు శ్రీవిష్ణు.
#Sreevishnu and #singleMovie team said sorry to #ManchuVishnu and #Kannappa movie team.
On using of sivayya and manchukurise words, also clarifies that these are eliminated from movie.#Tollywood #single #singletrailer #Geethaarts #LatestNews #Filicomarq pic.twitter.com/SFi37aJzSi
— FILicoMarq Media House (@FilicomarqHouse) April 30, 2025
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..




