AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ వారం థియేటర్/ఓటీటీలో రాబోయే సినిమాలు ఇవే..

వారం వారం సరికొత్త చిత్రాలు.. వెబ్ సిరీస్ ఆడియన్స్ ను అలరించేందుకు రెడీగా ఉంటున్నాయి. గతవారం కస్టడీ, రామబాణం వంటి సినిమాలు రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా.. ఇప్పుడు మరిన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అవెంటో తెలుసుకుందామా.

Tollywood: ఈ వారం థియేటర్/ఓటీటీలో రాబోయే సినిమాలు ఇవే..
Telugu Movies
Rajitha Chanti
| Edited By: seoteam.veegam|

Updated on: May 18, 2023 | 3:46 PM

Share

ఎండలు మండిపోతున్నాయి.. మరోవైపు బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమవుతున్నాయి. వారం వారం సరికొత్త చిత్రాలు.. వెబ్ సిరీస్ ఆడియన్స్ ను అలరించేందుకు రెడీగా ఉంటున్నాయి. గతవారం కస్టడీ, రామబాణం వంటి సినిమాలు రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా.. ఇప్పుడు మరిన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అవెంటో తెలుసుకుందామా.

అన్ని మంచి శకునములే.. యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జటంగా నటించిన లేటేస్ట్ చిత్రం అన్ని మంచి శకునములే. లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి ఈ సినిమాను రూపొందించగా.. స్వప్నదత్, ప్రియాంకదత్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మే 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

బిచ్చగాడు 2.. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సన్సెషన్ క్రియేట్ చేసిన సినిమా బిచ్చగాడు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది.అదే బిచ్చగాడు 2. తమిళ్ హీరో విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మే 19న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

ఇవి కూడా చదవండి

ఫాస్ట్ ఎక్స్.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులకు పరిచమయమున్న సిరీస్ ఫాస్ట్ అండ్ ప్యూరియస్. అందులో నటించిన విన్ డీజిల్ అంటే అందరికీ పిచ్చి క్రేజ్. ఈ సిరీస్ లో రాబోతున్న తర్వాతి చిత్రం ఫాస్ట్ ఎక్స్. ఈ సినిమా మే 19న రిలీజ్ కాబోతుంది.

ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు.. వెబ్ సిరీస్‏లు..

సోనీ లివ్.. ఏజెంట్.. మే 19… కడిన కదోరమీ అంద కదహం.. (మలయాళం).. మే 19

డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. డెడ్ పిక్సెల్స్.. మే 19

నెట్ ఫ్లిక్స్.. అయాలవాషి.. (మలయాళం).. మే 19 కథల్‌.. (హిందీ).. మే 19 బయీ అజైబి.. (ఇంగ్లీష్‌).. మే 19 మ్యూటెడ్‌.. (ఇంగ్లీష్‌).. మే 19 నామ్‌.. (సీజన్‌-2) మే 1

అమెజాన్ ప్రైమ్.. మోడ్రన్ లవ్ చెన్నై.. (తమిళ్).. మే 18

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.