Kantara: కాంతార సినిమాకు కొత్త చిక్కు.. ఆ సూపర్‌ హిట్‌ పాట కాపీ చేశారంటూ..

తాజాగా ఈ చిత్రంలోని ఒక పాటపై ఏకంగా కాపీరైట్‌ ఉల్లంఘన ఆరోపణలు వస్తున్నాయి. కాంతారా చిత్రంలో వరాహ సాంగ్‌ బాగా హిట్‌ అయింది. అది మ్యూజిక్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. 

Kantara: కాంతార సినిమాకు కొత్త చిక్కు.. ఆ సూపర్‌ హిట్‌ పాట కాపీ చేశారంటూ..
Kantara
Follow us
Basha Shek

|

Updated on: Oct 25, 2022 | 2:17 PM

శాండల్‌వుడ్‌ దాటి ప్యాన్‌ ఇండియా చిత్రంగా మారిన కాంతారా చుట్టు కొత్త వివాదం ముసురుకుంది. రిషబ్‌ శెట్టి హీరోగా, ఆయన దర్శకత్వంలో వచ్చిన కాంతారా గొప్ప హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రంలోని కొన్ని సంప్రదాయాలపై ఇటీవల కొన్ని వివాదాలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రంలోని ఒక పాటపై ఏకంగా కాపీరైట్‌ ఉల్లంఘన ఆరోపణలు వస్తున్నాయి. కాంతారా చిత్రంలో వరాహ సాంగ్‌ బాగా హిట్‌ అయింది. అది మ్యూజిక్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.   కన్నడ బ్లాక్ బస్టర్  కాంతారాలోని వరాహ రూపం పాట తమ పాటకు కాపీకి అని కేరళకు చెందిన ప్రముఖ మ్యూజిక్‌ బ్యాండ్‌ తైక్కుడం బ్రిడ్జి ఆరోపిస్తోంది. వరాహ రూపం పాటను ఐదారేళ్ల క్రితమే నవరసం పేరుతో ఈ మ్యూజిక్‌ బ్యాండ్‌ విడుదల చేసింది. కాగా యూట్యూబ్‌లో ఈ పాటకు 42 లక్షల వ్యూస్‌ ఉన్నాయి. ఈ నవరస పాట, వరాహ రూపం రెండింటిని చూస్తే పెద్దగా తేడా అనిపించదు. నవరస పాటలోని ఆర్కెస్ట్రాను కాంతారాలోని వరాహారూపం పాటకు యథాతథంగా తీసుకున్నారని మ్యూజిక్‌ బ్యాండ్‌ తెక్కుడం బ్రిడ్జి ఆరోపిస్తోంది. ఈ పాటను ఉపయోగించుకుంటున్నందుకు కనీసం తమకు కరెస్టీ కూడా ఇన్వలేదని అంటోంది. దీనిపై న్యాయపోరాటం చేస్తామని అంటోంది.  దీనికి సంబంధించిన ఫిర్యాదును తమ అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేసిన తైక్కుడం బ్రిడ్జి దీనికి కాంతార సినిమా నిర్మాత, సంగీత దర్శకుడు, దర్శకులను ట్యాగ్‌ చేసింది

మరో వైపు కాంతారా చిత్ర మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజనీశ్‌ ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. రెండు పాటల్లో ఒకే రాగం ఉపయోగించడం వల్ల ఒకేలాగా అనిపిస్తోందని అంటున్నారు. అయితే సినిమా నిర్మాతలు, దర్శకుడు ఇంకా ఈ ఆరోపణలపై స్పందించలేదు. మరోవైపు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల ప్రభంజనం కురిపిస్తోంది. కన్నడలో ఇప్పటికే   200 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లోనూ వసూళ్లు రాబడుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి