- Telugu News Entertainment Tollywood Telugu Indian Idol Season 4 Semi Final Episode Will Be Streaming on Aha OTT
Telugu Indian Idol 4: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 సెమీ ఫైనల్ వచ్చేసింది..
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా నిత్యం సరికొత్త కంటెంట్ అడియన్స్ ముందుకు తీసుకువస్తుంది. తెలుగులో సూపర్ హిట్ సినిమాలతోపాటు జనాలను ఆకట్టుకునే వెబ్ సిరీస్ తీసుకువస్తుంది. అలాగే గేమ్ షోస్, రియాల్టీ షోస్, ప్రోగ్రామ్స్ అంటూ ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది.

Updated on: Oct 24, 2025 | 9:26 PM
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా.. ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఎప్పుడూ ముందుంటుంది. సూపర్ హిట్ చిత్రాలు, వెబ్ సిరీస్ లు, అదిరిపోయే గేమ్ షోలతో సినీప్రియులను అలరిస్తుంది. ఇక సింగింగ్ టాలెంట్ ఉన్న గాయనీగాయకులకు అద్భుతమైన అవకాశాన్ని అందించేందుకు ఇప్పటికే తెలుగు ఇండియన్ ఐడల్ షో పేరుతో ఓ సింగింగ్ షోను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ షో విజయవంతంగా మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ షో నాలుగో సీజన్ నడుస్తోంది. కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన నాలుగో సీజన్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీస్ ఈ షోలో సందడి చేశారు.
ఒకే ఒక్క బిస్కెట్ యాడ్ జీవితాన్నే మార్చేసింది.. కట్ చేస్తే 260కు పైగా సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్
ఇప్పటికే చాలా మంది ఈ తెలుగు సింగింగ్ షోలో సందడి చేసి గాయనీగాయకులకు మద్దతు తెలిపారు. ఇక ఈ సింగింగ్ షో మరికొన్ని రోజుల్లో ముగుస్తుంది. తాజాగా సెమి ఫైనల్ ఎపిసోడ్ ఆహాలోకి వచ్చేసింది. ఈ ఎపిసోడ్ కు గెస్ట్ గా అందాల భామ శ్రుతిహాసన్ హాజరైంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమోలు ప్రేక్షకులకు ఈ ఎపిసోడ్ పై అంచనాలు పెంచేశాయి.
ప్రభాస్‌కు అమ్మగా, గోపిచంద్‌కు వదినగా చేసింది.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
ఈ షోలో ఎప్పటిలాగే తమన్, కార్తీక్, గీతా మాధురి జడ్జీలుగా వ్యవహరిస్తుండగా.. సమీరా భరద్వాజ్, శ్రీరామచంద్ర హోస్టింగ్ చేస్తున్నారు. ఈరోజు ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా సెమీ ఫైనల్ ఎపిసోడ్ ను ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ను అస్సలు మిస్ అవ్వకండి.
బుర్రపాడు సిరీస్ రా బాబు..! మిస్టరీ గదిలో పిచ్చెక్కించే అమ్మాయిలు..!!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








