అసలే ఫ్లాపుల్లో ఉన్నావ్.. హిట్ సినిమాను ఎలా రిజెక్ట్ చేశావ్ అన్న..!! తెలుసు కదా సినిమాను వదులుకున్న హీరో ఇతనే..
సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించిన సినిమా తెలుసు కదా. నీరజా కోన దర్శకత్వం వహించిన ఈ సినిమాను అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది.

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా తెలుసు కదా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కిన తెలుసు కదా సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. మొదటి షో నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటించారు. డు డిఫరెంట్ కథ కథనంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకోవడంతో ప్రేక్షకులు, చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సూపర్ హిట్ సినిమాను ఓ యంగ్ హీరో చేతులారా మిస్ చేసుకున్నాడట. అసలే ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆ యంగ్ హీరో ఇలాంటి సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకోవడంతో ఆయన అభిమానులు కాస్త ఫీల్ అవుతున్నారు. ఇంతకూ ఆ యంగ్ హీరో ఎవరో తెలుసా.?
తెలుసు కథ లాంటి సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్న యంగ్ హీరో ఎవరో కాదు.. నితిన్. ఈ మధ్యకాలంలో నితిన్ ను బ్యాడ్ లక్ వెంటాడుతుంది. ఏ సినిమా చేసిన అది డిజాస్టర్ గా నిలుస్తుంది. భీష్మ సినిమా తర్వాత చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. మధ్యలో వచ్చిన రంగ్ దే సినిమా కాస్త పర్లేదు అనిపించుకుంది. కానీ ఆతర్వాత చేసినవన్నీ డిజాస్టార్సే.. ఇదిలా ఉంటే తెలుసు కథ సినిమా కూడా ముందుగా నితిన్ చేతికి వెళ్లిందట. ఈవిషయాన్ని హీరో సిద్దునే స్వయంగా తెలిపాడు.
తెలుసు కదా సినిమాకు ఫస్ట్ ఛాయిస్ నేను కాదు, నీరజ ఈ కథతో నితిన్ వద్దకు వెళ్లిందని సిద్దు తెలిపారు. ఈ కథ మొత్తం విన్న నితిన్ ఒకరోజు రాత్రి తనకు ఫోన్ చేసి ఇలా ఒక కథ ఉంది అది నువ్వు వినాలి అని చెప్పాడట. ఆ కథ నీకైతేనే కరెక్ట్ గా సరిపోతుందని నితిన్ చెప్పాడట.. అలా నితిన్ అన్న వద్దకు వెళ్ళిన ఈ కథ ఆయన రిజెక్ట్ చేస్తేనే నా వరకు వచ్చిందని ఈ విషయంలో నితిన్ అన్నకు తాను ముందుగా థాంక్స్ చెప్పాలని సిద్దు జొన్నలగడ్డ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవ్వడంతో.. సూపర్ హిట్ సినిమాను ఎలా మిస్ చేసుకున్నావ్ అన్నా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








