15 January 2026

అందం, అభినయం ఉన్న అదృష్టం కలిసిరాని ముద్దుగుమ్మ .. 

Rajeev 

Pic credit - Instagram

సినిమా ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు రాణిస్తున్నారు. వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. 

వారిలో రీతూ వర్మ ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. 

ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమాలోనూ హీరోయిన్ చెల్లిగా నటించింది ఈ అందాల భామ. ఆతర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 

హీరోయిన్ గా మారిన తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ నటించింది. 

కానీ ఈ బ్యూటీకి సాలిడ్ హిట్ మాత్రం దక్కడం లేదు.. కేవలం నటనతోనే కాదు అభినయంతోనూ మెప్పిస్తుంది రీతూ

మొన్నామధ్య సందీప్ కిషన్ తో కలిసి మజాకా అనే సినిమా చేసింది. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. 

అలాగే దేవిక అండ్ డానీ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఇక సోషల్ మీడియాలో ఫొటోలతో అదరగొడుతుంది.