ఒడిశాలో అత్యంత షాకింగ్ ఘటన జరిగింది. ఎనిమిదేళ్ల బాలుడు దుకాణంలో స్నాక్ పాకెట్ కొన్నాడు. 'లైట్ హౌస్' అనే బ్రాండ్‌కు చెందిన కార్న్ పఫ్స్ ప్యాకెట్‌ను కొనుగోలు చేశాడు. స్నాక్స్ తిన్న తర్వాత, అందులో వచ్చిన చిన్న బొమ్మతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆ సమయంలోనే ఆ బొమ్మ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఆపేలుడు ప్రభావంతో బాలుడి కంటి గుడ్డు పగిలిపోయింది.