Tollywood: ఒక ఫ్రేమ్‌లో ఒకప్పటి టాలీవుడ్ స్టార్స్.. వైరలవుతోన్న పాత ఫొటో.. ఏ సందర్భంలో దిగారో తెలుసా?

అప్పుడప్పుడు మన సినిమా సెలబ్రిటీల పాత ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అలా తాజాగా ఒకప్పటి టాలీవుడ్ సెన్సేషన్ స్టార్స్ ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ఫొటోలో తరుణ్, ఉదయ్ కిరణ్, సదా, ఆర్తి అగర్వాల్ ఉన్నారు. వీరిలో ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు

Tollywood: ఒక ఫ్రేమ్‌లో ఒకప్పటి టాలీవుడ్ స్టార్స్.. వైరలవుతోన్న పాత ఫొటో.. ఏ సందర్భంలో దిగారో తెలుసా?
Tollywood Stars
Follow us
Basha Shek

|

Updated on: Nov 02, 2024 | 6:53 AM

తరుణ్, ఉదయ్ కిరణ్, సదా, ఆర్తి అగర్వాల్.. ఒకప్పటి టాలీవుడ్ సెన్సేషన్ స్టార్స్. ముఖ్యంగా ప్రేమ కథా చిత్రాలకు వీరు కేరాఫ్ అడ్రస్. తమ సినిమాలతో యూత్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తరుణ్, ఉదయ్ కిరణ్ లవర్ బాయ్స్ గా అప్పటి యూత్ కి ఫేవరేట్ హీరోలు అయితే, అమ్మాయిల కలల రాకుమారులు. ఇక సదా, ఆర్తి అగర్వాల్ అయితే ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ హీరోయిన్స్. దురదృష్టవశాత్తూ వీరిలో ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ మన మధ్య లేరు. ఇక తరుణ్, సదా ఇద్దరూ కూడా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. కాగా ఈ నలుగురు కలిసి దిగిన ఫొటో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో 2005లో తీసినట్టు తెలుస్తుంది. ఈ ఫొటోని క్లిక్ మనిపించిన ఒక సీనియర్ ఫొటోగ్రాఫర్ దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా నెట్టింట వైరలవుతోంది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో బోట్ లో వీళ్లు కూర్చున్నప్పుడు తీసిన ఫొటో ఇది.

2005 లో తరుణ్ – ఆర్తి అగర్వాల్ జంటగా సోగ్గాడు సినిమా, ఉదయ్ కిరణ్ – సదా జంటగా ఔనన్నా కాదన్నా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కేవలం వారం రోజుల వ్యవధిలో ఈ రెండు సినిమాలు రిలీజయ్యాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఓ కార్యక్రమంలో వీరు హుస్సేన్ సాగర్ లో సందడి చేశారు. సరదాగా బోటులో షికారు చేశారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవ్వడంతో సినీ అభిమానులు, నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. ముఖ్యంగా ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. అలాగే తరుణ్, సదా మళ్లీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

హుస్సేన్ సాగర్ లో బోటు షికారులో టాలీవుడ్ స్టార్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!