AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: ఇది పుష్పగాడి సత్తా.. విడుదలకు ముందే విధ్వంసం.. రికార్డులు కొల్లగొడుతున్న పుష్ప 2..

యావత్ ప్రపంచం మొత్తం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 ది రూల్. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం సినీప్రియులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 5న ఈ మూవీ గ్రాండ్‏గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తాజాగా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ కొల్లగొట్టాడు పుష్పరాజ్.

Pushpa 2: ఇది పుష్పగాడి సత్తా.. విడుదలకు ముందే విధ్వంసం.. రికార్డులు కొల్లగొడుతున్న పుష్ప 2..
Pushpa 2
Rajitha Chanti
|

Updated on: Nov 20, 2024 | 2:03 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 విడుదలకు ఇంకా పదిహేను రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఇప్పుడు ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అభిమానులకు మరింత ఉత్సాహపరుస్తుంది. ఈసారి నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్ లెవల్లో సత్తా చాటేందుకు రెడీ అయ్యింది పుష్ప 2. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడూ చూద్ధామా అని ఫుల్ జోష్ లో ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈసారి పుష్పరాజ్ గా బన్నీ ఎలాంటి మాస్ మేనరిజం చూపించనున్నాడని ఆసక్తి నెలకొంది. ఇక ఈసారి పుష్ప 2లో అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్ మధ్య వచ్చే సీన్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు పుష్ప 2 విడుదలకు ముందు రికార్డ్స్ కొల్లగొడుతుంది. గత సినిమాల బాక్సాఫీస్ వసూళ్లపై కన్నేసింది. ఇప్పటికే విదేశాల్లో ప్రీ బుకింగ్స్ లో సత్తా చాటుతుంది. అమెరికాలో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేందుకు సిద్ధమైంది. భారత్‌తో పోలిస్తే అమెరికాలో ప్రీ-బుకింగ్ ముందుగానే ప్రారంభమవుతుంది. అతి తక్కువ సమయంలోనే అమెరికాలో ప్రీ బుకింగ్స్ లో మిలియన్ డాలర్స్ (8.43 కోట్లు) దాటిన తొలి భారతీయ చిత్రంగా ‘పుష్ప 2’ నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ, స్త్రీ 2, జవాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను సైతం వెనక్కు నెట్టేసింది పుష్ప 2. ప్రీ బుకింగ్స్ లో అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్స్ క్రాస్ చేసిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. కొన్ని గంటల్లోనే వన్ మిలియన్ డాలర్స్ మార్క్ క్రాస్ చేసింది. ఇది కేవలం బుకింగ్ సమాచారం మాత్రమే. అటు ఈ చిత్రానికి బాక్సాఫీస్ కలెక్షన్స్ మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో వన్ మిలియన్ వసూళ్లు రాబట్టిన సినిమాగా పుష్ప 2 రికార్డు సృష్టించింది అంటూ మైత్రీ మూవీ మేకర్స్ అధికారిక ప్రకటించారు. ‘మరో రోజు మరో రికార్డు.. చరిత్ర పుటల్లో మరో అధ్యాయం చేరిపోయింది’ అంటూ రాసుకొచ్చింది.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us