Indravathi Chauhan: క్రేజ్ తగ్గని ఊ అంటావా సాంగ్.. సింగర్‌కు ఏకంగా గోల్డ్ మెడల్..
సమంత నటించిన ఈ స్పెషల్ సాంగ్ దేశవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులను ఆకట్టుకుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప (Pushpa) సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే.. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కేవలం సినిమా మాత్రమే కాదు.. ఇందులోని ప్రతి సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేశాయి.. ముఖ్యంగా ఊ అంటావా..మావ ఊహు అంటావా సాంగ్ ఏ రేంజ్లో దూసుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమంత నటించిన ఈ స్పెషల్ సాంగ్ దేశవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులను ఆకట్టుకుంది. సింగర్ ఇంద్రావతి మత్తెక్కించే వాయిస్.. సమంత కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్.. డ్యాన్స్‌తో ఊ అంటావా సాంగ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది.. తాజాగా ఈ పాట పాడిన సింగర్ ఇంద్రావతి చౌహాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ పాటకు పాడినందుకు గానూ.. బిహైండ్ వుడ్ సంస్థ నుంచి గోల్డ్ మేడల్ అందుకోనుంది ఇంద్రావతి.. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది.
ప్రముఖ డిజిటల్ మీడియా గ్రూప్ బిహైండ్ వుడ్ సంస్థ ఈ ఏడాది 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సంస్థ యానివర్సరి సెలబ్రెషన్స్ లో భాగంగా మే 22 అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాలు, ఉత్తమ నటీనటులు, సింగర్లకు గోల్డ్ మెడల్స్ ప్రదాన చేయనుంది. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం బిహైండ్ వుడ్ సంస్థ సింగర్ ఇంద్రావతికి గోల్డ్ మెడల్ ఇవ్వనున్నట్లు తెలిపింది. మే 22న ఊ అంటావా మావ పాటకు గోల్డ్ మెడల్ తీసుకోబోతున్నానని.. అందుకు తావు నిజంగా తాను ఆశీర్వాదించబడ్డాను.. బెస్ట్ థింగ్స్ ఎప్పుడూ ఊహిచకుండానే వస్తాయి. నాకు ఇంతటి గుర్తింపు రావడానికి కారణం దేవీ శ్రీ ప్రసాద్ గారు.. ఆయనకు ఎప్పటికీ కృతజ్ఞురాలిని.. ఇది నిజంగా గర్వంచే విషయం అంటూ చెప్పుకొచ్చారు ఇంద్రావతి..
I’m really so blessed that I’m going to receiving the gold medal on may 22 for oo antava mava song #pushpa movie?. Best things happen unexpectedly!!! I’m really very much excited and can’t express my happiness?.I will always owe to the @ThisIsDSP sir?????..this is proud moment pic.twitter.com/zVDNuiBFIn
— Indravathi Chauhan (@IndravathiChauh) May 15, 2022