Parasuram : మహేష్ గారికి ఇచ్చిన మాటను సర్కారు వారి పాటతో నిలబెట్టుకున్నా : పరశురామ్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ బ్లక్ బస్టర్ మూవీ సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)నటించిన లేటెస్ట్ బ్లక్ బస్టర్ మూవీ సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata). పరశురామ్(Parasuram )దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా పాత రికార్డులను తిరగ రాస్తూ సరికొత్త రికార్డులను తనఖాతాలో వేసుకుంటుంది. ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా కళావతి పాట యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు చిత్రయూనిట్. సర్కారు వారి పాట మా మా మాస్ సెలబ్రేషన్స్ ను కర్నూల్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్, తమన్ , మైత్రి మూవీస్ అధినేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ..
మహేష్ బాబు గారి ఒక్కడు సినిమా చూసి డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను. మహేష్ బాబు గారిని సినిమా దర్శకత్వం వహించి, సినిమా విజయోత్సవం కర్నూల్ లో జరుగుకోవడం అనేది నాకు లైఫ్ టైం గిఫ్ట్ అని అన్నారు. మహేష్ బాబుగారికి థ్యాంక్స్ చెప్పడం చిన్న మాట. మహేష్ గారిని ఎంత ప్రేమిస్తానో మాటల్లో చెప్పలేను. మహేష్ గారికి మంచి సినిమా ఇస్తానని మాటిచ్చాను. ఆ మాట సర్కారు వారి పాటతో నిలబెట్టుకోవడం చాలా ఆనందంగా వుంది అన్నారు. సంగీత దర్శకుడు తమన్, డీవోపీ మధి, ఎడిటర్ మార్తండ కే వెంకటేష్, అనంత్ శ్రీరాం, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ టీం చందు, రాజు,శేఖర్ ..అందరికీ ధన్యవాదాలు తెలిపారు పరశురామ్. సర్కారు వారి పాటని ఇంత స్థాయిలో తీర్చిదిద్దిన నిర్మాతలు నవీన్ , రవి, గోపి గారు, రామ్ , జీఏంబీ ఎంటర్టైన్మెంట్ తరపున నమ్రతగారికి స్పెషల్ థ్యాంక్స్. ఈ సినిమాని ఇంత ఘన విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు” అని అన్నారు పరశురామ్
మరిన్ని ఇక్కడ చదవండి :