Major: మేజర్ సినిమా సెకండ్ సింగిల్ ఓహ్ ఇషా.. రొమాంటిక్ మెలోడీ వచ్చేది ఎప్పుడంటే..

డైరెక్టర్ శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు సొంత బ్యానర్ సంస్థ జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది.

Major: మేజర్ సినిమా సెకండ్ సింగిల్ ఓహ్ ఇషా.. రొమాంటిక్ మెలోడీ వచ్చేది ఎప్పుడంటే..
Major
Follow us
Rajitha Chanti

|

Updated on: May 16, 2022 | 8:42 PM

యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం మేజర్ (Major).. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. డైరెక్టర్ శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు సొంత బ్యానర్ సంస్థ జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సినిమా పై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి.. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళం భాషలో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్..

ఈ చిత్రం విడుదలైన మొదటి పాట హృదయం సంగీత ప్రియులను ఆకట్టుకుంది. ఈ పాటలో ప్రేమ కథని అందంగా చూపించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం నుండి సెకెండ్ సింగల్ ”ఓహ్ ఇషా’ వీడియో సాంగ్ మే 18న చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో శేష్, సాయి మంజ్రేకర్ జోడి బ్యూటీఫుల్ అండ్ లవ్లీగా కనిపించారు. 1995లో యంగ్ సందీప్ లవ్ లైఫ్ ని ఈ పోస్టర్ లో ఆవిష్కరించారు. అలాగే పోస్టర్ డిజైన్ కూడా 1995 పాత ఆడియో క్యాసెట్ అంచులని గుర్తు చేస్తూ వింటేజ్ లుక్ లో డిజైన్ చేశారు. ఈ పాట మరో రొమాంటిక్ మెలోడీగా ఉండబోతోంది. వివిధ భాషలకు చెందిన ముగ్గురు సూపర్‌స్టార్లు విడుదల చేసిన మేజర్ థియేట్రికల్ ట్రైలర్ దేశవ్యాప్తంగా ఆదరణ పొందింది. ఇప్పటివరకూ ట్రైలర్ 35 మిలియన్ల వ్యూస్, 900కే పైగా లైక్‌లను పొందింది. 26/11 ముంబై దాడులలో దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన బ్రేవ్ హార్ట్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌కు ఘనమైన నివాళిగా రూపొందిన ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందించారు. 2022లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో మేజర్ చిత్రం ముందు వరుసలో ఉంది.

ఇవి కూడా చదవండి