Karate Kalyani: నేనెక్కడికి పారిపోలేదు.. పరిగెత్తించే రకం.. అజ్ఞాతం వీడిన కరాటే కల్యాణి

తాను పిల్లలను అమ్ముకోలేదని.. ఈ వివాదం వెనుక ఎవరున్నారో తెలుసంటూ కల్యాణి పేర్కొన్నారు. తాను పిల్లలను అమ్ముకునే రకం కాదని.. తనకు పిల్లలు లేరని కల్యాణి పేర్కొన్నారు.

Karate Kalyani: నేనెక్కడికి పారిపోలేదు.. పరిగెత్తించే రకం.. అజ్ఞాతం వీడిన కరాటే కల్యాణి
Karate Kalyani
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 16, 2022 | 9:22 PM

Karate Kalyani Press Meet: వరుసగా వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న సినీ నటి కరాటే కల్యాణి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తానెక్కడికీ పారిపోలేదని.. పరిగెత్తించే రకం అంటూ పేర్కొన్నారు. తాను పిల్లలను అమ్ముకోలేదని.. ఈ వివాదం వెనుక ఎవరున్నారో తెలుసంటూ కల్యాణి పేర్కొన్నారు. తాను పిల్లలను అమ్ముకునే రకం కాదని.. తనకు పిల్లలు లేరని కల్యాణి పేర్కొన్నారు. యూట్యూబర్‌తో ఘర్షణ అనంతరం కరాటే కల్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కరాటే కల్యాణి చిన్నారికి కొనుగోలు చేసినట్టుగా ఫిర్యాదులు అందడంతో అధికారులు ఈ సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో కరాటే కల్యాణి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కల్యాణీ తాను ఎక్కడికీ పారిపోలేదని.. క్షేమంగానే ఉన్నానంటూ మీడియాతో సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. తాను ఎవరినీ దత్తత తీసుకోలేదని కల్యాణి పేర్కొన్నారు. తనకు ఆడపిల్లలంటే ఇష్టమన్నారు. తాను ఎవరినీ కిడ్నాప్ చేయలేదంటూ కల్యాణి పేర్కొన్నారు. కొంతకాలం తర్వాత పాపను దత్తత తీసుకుందామనుకున్నానని.. తనకూ చట్టాల గురించి తెలుసని.. కల్యాణి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కల్యాణి.. పాప తల్లిదండ్రులను కల్యాణి మీడియాకు చూపించారు. పిల్లను పోషించలేక కల్యాణి దగ్గర ఉంచినట్లు పాప తల్లిదండ్రులు పేర్కొన్నారు. తమకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని.. పాపకు మంచి భవిష్యత్తు కోసమే కల్యాణికి ఇచ్చామని పేర్కొన్నారు.

కరాటే కల్యాణి కామెంట్స్‌ను ఈ కింది వీడియోలో చూడండి..   

ఇవి కూడా చదవండి