Pan India Film: దక్షిణాది సినిమాలకు పెరుగుతున్న క్రేజ్.. కేజీఎఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్‌లను పాన్ ఇండియాగా పేర్కొనడం కరెక్టేనా..?

పాన్ ఇండియన్ అనే పదం... దాని వలన కలిగే అధిక ఉత్సాహం రెండూ కూడా సమస్యాత్మకమైనవి.. గతంలో హీరో సిద్ధార్థ్ చెప్పినట్లుగానే హిందీ భాష కానీ చిత్రాలను

Pan India Film: దక్షిణాది సినిమాలకు పెరుగుతున్న క్రేజ్.. కేజీఎఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్‌లను పాన్ ఇండియాగా పేర్కొనడం కరెక్టేనా..?
Kgf
Follow us

|

Updated on: May 16, 2022 | 10:09 PM

ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2 చిత్రాలు దేశవ్యాప్తంగా భారీగా వసూళ్లు సాధించాయి. ఈ చిత్రాలు ఇప్పుడు ఇండియన్ సినీ పరిశ్రమలో పాన్ ఇండియా అంటూ ట్రెండ్ సెట్టర్ చేశాయి. గతంలోనూ 2015, 2017 సంవత్సరాలలో బాహుబలి సినిమా మొట్ట మొదటి సారిగా పాన్ ఇండియా సినిమా అనే పదాన్ని తెరపైకి తీసుకువచ్చింది.. నిజానికి దక్షిణాది చిత్రపరిశ్రమ, ఉత్తరాది సినీ పరిశ్రమ (బాలీవుడు)లు రెండూ ఈ పాన్ ఇండియా అనే పదా4న్ని ఉపయోగించాయి.. ఇందుకు కారణం ఇటీవల పలు దక్షిణాది చిత్రాలు హిందీ ప్రేక్షకుల మనసులు దొచుకున్నాయి. దేశవ్యాప్తంగా హిందీ చిత్రాలు మాత్రమే ఈ పదంతో వ్యాపారాన్ని చేయగలవు.. అయితే ఈ పాన్ ఇండియన్ అనే పదం సామాజికంగా.. రాజకీయంగా సరైనదేనా అనే ప్రశ్నలు చాలానే వచ్చాయి..

పాన్ ఇండియన్ అనే పదం… దాని వలన కలిగే అధిక ఉత్సాహం రెండూ కూడా సమస్యాత్మకమైనవి.. గతంలో హీరో సిద్ధార్థ్ చెప్పినట్లుగానే హిందీ భాష కానీ చిత్రాలను ఇతర చేయడమనేది చాలా ప్రాథమికమైనది.. ఈ పాన్ ఇండియా అనేది హిందీలో లేని ఇతర చిత్రాలకు ఒక మార్గం లాంటిది. బాలీవుడ్ చిత్రాలను పాన్ ఇండియ సినిమాలు అని ఎప్పటికీ అనరు.. అలాంటి సమయంలో దక్షిణాది చిత్రాలను మాత్రమే ఎందుకు పాన్ ఇండియా సినిమా అనడం.. కన్నడ సినిమా లేదా తెలుగు సినిమా అనొచ్చు కదా అని హీరో సిద్ధార్థ్ అన్నారు… భారతీయ జనాభాలో కేవలం 40 శాతం మంది మాత్రమే హిందీ మాట్లాడతారు.. అలాంటి భాషలో తెరకెక్కించిన పాన్ ఇండియన్ సినిమా అని పిలవనప్పుడు తెలుగు సినిమాను మాత్రమే పాన్ ఇండియా సినిమా అని ఎందుకు అనాలి ? అనే సందేహాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ రెండు చిత్రాలు తమ సొంత భాషలలో రూపొందించినవే.. కానీ ఈ చిత్రాలు ఇతర భాషల ప్రేక్షకుల మనసులను దొచుకున్నాయి. ఇదే విషయంపై మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ సైతం స్పందించారు. అన్ని భారతీయ భాషలకు సమానమైన ప్రాముఖ్యత ఉందని తెలిపాడు.. ఇదే విషయం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 344 (1), 351 లోనూ ఉంది..

కానీ ఇతర భాషలపై హిందీకి ఉన్న ఆధిపత్యమే ఈ సమస్యకు ప్రధాన కారణం. పాన్ ఇండియాన్ అనే పదాన్ని క్లయిమ్ ను ఆమోదించడం ద్వారా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ ఆధిపత్యాన్ని అంగీకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా హిందీ భాషను దేశమంతా వ్యాప్తి చేయాలనుకోవడం.. పాన్ ఇండియన్ పదాన్ని అంగీకరించడం కూడా సాంస్కృతికంగా సజాతీయ భారతదేశానికి ఆమోదం తెలిపినట్లే.. అయితే కొన్ని చిత్రాలు మాత్రం… ప్రాథమిక సారాంశానికి విరుద్ధంగా సజాతీయ పాత్రను సాధించడానికి ప్రయత్నిస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్లో.. అంటే ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాలు మాత్రమే స్వాభావికమైన బహుళత్వం లేకుండా ప్రదర్శించేందుకు అత్యథిక మెజారిటీని కలిగి ఉన్నాయి. బహుళత్వం లేని భారతదేశం పాన్ ఇండియా అయితే.. అది సాంస్కృతిక ఆలోచనకు స్పష్టంగా ద్రోహం చేస్తున్నట్టే. సినిమాను ప్రేక్షకుల మనసుకు హత్తుకున్నట్లుగా.. భూమి కథను పెద్దదిగా.. విభిన్న తారాగణంతో తెరకెక్కించాలి.. అలాగే అన్ని భాషల చిత్రపరిశ్రమల నుంచి ఫేమస్ నటీనటులతో చేయండి.. కానీ సినిమాను తెరకెక్కించినప్పుడు కథలోని సున్నితత్వాన్ని.. సంస్కృతిని కోల్పోవద్దు అని చెప్పుకొచ్చారు హీరో దుల్కర్ సల్మాన్.

ఇక ఇప్పుడు డిజిటల్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్.. ఓటీటీ రాకతో హిందీ మాత్రమే కాకుండా.. అన్ని భారతీయ చిత్రాలు కూడా పాన్ ఇండియా సినిమాలుగా మారాయి.. సల్మాన్ ఖాన్ సినిమాలు చెన్నై లేదా కర్నూల్ ప్రాంతాల్లో విడుదలైనట్టుగానే.. తమిళంలో జైపూర్, అహ్మదాబాద్ వంటి నగరాల్లో రజనీకాంత్ సినిమాలు కూడా విడుదలవుతాయి. అలాగే మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు సినిమాలు కూడా దేశవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించాయి. ఓటీటీలో పలు చిత్రాలు మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్నాయి… అంటే నెట్ ఫ్లిక్స్ లో మలయాళ సినిమా మిన్నల్ మురళిన స్పానిష్, పోర్చుగీస్ తో సహా ఎనిమిది భాషలలో.. 38 సబ్ టైటిల్‏తో విడుదల చేశారు.

బిజినెస్ పరంగా పాన్ ఇండియన్ చిత్రాలకు కొన్నిసార్లు ఆటంకాలు ఏర్పడినప్పటికీ ఓటీటీ.. డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా భారతీయ సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కొత్త సంస్కృతులు.. సెన్సిబిలిటీస్ కు ఎక్కువ బయటపెట్టడం వలన ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా ఇతర భాష చిత్రాలకు ఆకర్షితులు అవుతారు.. కొందరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడం హిందీ పరిశ్రమ వారిని పాన్ ఇండియన్ అని పిలవడమనేది వారిని మధ్యపెట్టడానికి కారణం కాదు.. ఈ భాష పరిశ్రమలు అనేవి.. ప్రస్తుతం హిందీ పరిశ్రమ సినిమాల పరంగా వచ్చే లాభాలు కొన్ని సినిమాలు భారీ మొత్తంలో డబ్బు సంపాదించడంతో “పాన్-ఇండియన్” అని హిందీ పరిశ్రమ పిలుస్తోంది. ఈ పొగడ్తల గురించి కొంత స్పృహ కలిగి ఉండాలి. హిందీ పరిశ్రమను మించి లాభాలను అధిగమించడం చూసి ఉత్సాహంగా ఉన్నా.. తమను తాము అదే విధంగా పిలుచుకోవడం మానుకోవాలి. ఇది హిందీ అయినా, దక్షణాది సినిమాలు అయినా సరే.. వాటి పరిమితిని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గమనిక :- దక్షిణాది సినిమాలు – పాన్ ఇండియా ప్రచారంపై వ్యాసకర్త జీ ప్రమోద్ కుమార్ న్యూస్9కు ప్రత్యేక వ్యాసం రాశారు. ఇందులో బాలీవుడ్ (హిందీ సినిమాలు), దక్షిణాది సినిమాల ప్రభావం, పాన్ ఇండియా ప్రచారం, వ్యాపారం తదితర విషయాలను ప్రస్తావించారు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో