Nag Ashwin: ఆ చిరంజీవి సినిమా ఎందుకు ఆడలేదో అర్థం కాలేదు.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు

శంకరాభరణం సినిమా నుంచి స్వయం కృషి, అపద్భాందవుడు వంటి అద్భుతమైన సినిమాలను నిర్మించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‏..

Nag Ashwin: ఆ చిరంజీవి సినిమా ఎందుకు ఆడలేదో అర్థం కాలేదు.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Nag Ashwin
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: May 16, 2022 | 6:56 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన అపద్భాంధవుడు సినిమా ఎందుకు ఆడలేదో తనకు అర్థం కాలేదన్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్.. తాను కాలేజీ చదివే రోజుల్లోనే అపద్భాంథవుడు సినిమా చూశానని.. కానీ ఆ సినిమా ఆడలేదని చాలా కోపం వచ్చిందన్నారు.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ శ్రీజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వస్తున్న తొలి చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నాగ్ అశ్విన్ అపద్భాంథవుడు సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

” పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ లోని పలు క్లాసిక్ మూవీలు వచ్చాయి. ఆ సినిమాలన్నీ చూశాను. అందులో నాకు ఆపద్భాంథవుడు సినిమా చాలా ఇష్టం. నేను చదువుతున్న రోజుల్లో ఆ సినిమా చూశాను. కానీ అది ఆడలేదని చాలా కోపం వచ్చింది. ఎందుకు ఆడలేదో ఆర్థంకాలేదు. ఈ జర్నీలో వారి వారసులు నిర్మిస్తున్న సినిమా ప్రమోషన్ కు సహయంగా మారడం సంతోషంగా వుంది. ఇంత పెద్ద సంస్థలో అవకాశం వుంటే తప్పకుండా నేను సినిమా చేస్తాను. ఇప్పుడు శ్రీజ ఎంటర్టైన్మెంట్ లో మంచి సినిమాలు రావాలి. అనుదీప్ కథ, స్క్రీన్క్ప్లే, డైలాగ్ ఇచ్చాడంటే చాలా ఫన్ వుంటుంది. జాతిరత్నాలు హిట్ తర్వాత తన స్వార్థం చూసుకోకుండా తన తోటివారిని ఎంకరేజ్ చేయడం నాకు గర్వంగా వుంది. దర్శకుడు వంశీ ఎం.బి.బి.ఎస్. చదివాడు. సినిమాపై తపన తో ఈ రంగంలోకి వచ్చాడు. ఇప్పుడు అనుదీప్ వల్ల దర్శకుడు అయ్యాడు. జాతిరత్నాలకు ముందు వంశీ ఒక షార్ట్ ఫిలిం తెచ్చాడు. కానీ అది చాలా లాంగ్ ఫిలింలా వుంది. తను కాలేజీ లో పలు స్కిట్ లు వేసేవాడు. జాతిరత్నాలకు కరెక్ట్ గా ఫిట్ అయ్యాడు. తనలో చాలా క్రియేటివిటీ ఉంది” అన్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్..

తెలుగు చిత్ర పరిశ్రమలో పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‏కు ప్రత్యేక స్థానం ఉంది. జాతీయస్థాయిలో పలు అవార్దులు పొంది తెలుగులో గర్వించే సంస్థగా పేరుపొందింది. సినీ పరిశ్రమలో ఆనాటి నుంచి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించింది. శంకరాభరణం సినిమా నుంచి స్వయం కృషి, అపద్భాందవుడు వంటి అద్భుతమైన సినిమాలను నిర్మించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ నిర్మాణ సంస్థ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా మారి శ్రీజ ఎంటర్ టైన్మెంట్ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు.. ఈ మూవీ బ్యానర్ పై వస్తున్న తొలి చిత్రం `ఫస్ట్ డే ఫస్ట్ షో`. ఈ చిత్ర లోగోను సోమవారం ప్రసాద్ ల్యాబ్ లో ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఆవిష్కరించారు. ఈ చిత్రానికి జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ శిష్యులు వంశీ, లక్ష్మీనారాయణ దర్శకులుగా పరిచయం అవుతున్నారు.

ఇవి కూడా చదవండి