AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chinmayi Sripaada: నెట్టింట సరోగసి ప్రెగ్నెన్సీ చర్చ.. తనదైన స్టైల్‌లో ఒక్కఫోటోతో ఇచ్చిపడేసిన సింగర్ చిన్మయి..

ప్రెగ్నెంట్‏గా ఉన్నప్పుడు దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ.. ప్రెగ్నెంట్‏గా ఉన్నప్పుడు నేను తీసుకున్న మొదటి సెల్ఫీ ఇది.. అంటూ రాసుకొచ్చింది చిన్మయి

Chinmayi Sripaada: నెట్టింట సరోగసి ప్రెగ్నెన్సీ చర్చ.. తనదైన స్టైల్‌లో ఒక్కఫోటోతో ఇచ్చిపడేసిన సింగర్ చిన్మయి..
Chinmayi Sripada
Rajitha Chanti
|

Updated on: Oct 18, 2022 | 6:14 PM

Share

సింగర్ చిన్మయి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. గాయనిగా.. డబ్బింగ్ ఆర్టిస్ట్‏గా ప్రేక్షకులకు దగ్గర్యయింది. అంతేకాకుండా ఆడపిల్లలు ఎదుర్కొంటున్న కష్టాలు.. వారిని ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటుంది. అమ్మాయిల తరపున తన సోషల్ మీడియా ఖాతాలో స్పందిస్తూ.. సమస్య చెప్పుకున్న ఆడపిల్లకు ధైర్యమిస్తుంది. ఇక ఆమె వ్యక్తిగత గురించి కూడా తెలిసిందే. డైరెక్టర్ కమ్ హీరో రాహుల్.. చిన్మయి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి కొద్ది నెలల క్రితం కవలపిల్లలు జన్మించినట్లు ఈ జంట సోష్ల మీడియా ద్వారా ప్రకటించారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. అందుకు కారణం ప్రెగ్నెంట్‏గా ఉన్న ఫోటోస్ ఒక్కటి కూడా నెట్టింట షేర్ చేయలేదు. దీంతో ఆమె సరోగసి ద్వారా పిల్లలకు జన్మచ్చిందంటూ విమర్శలు వచ్చాయి. అయితే తనపై వస్తున్న కామెంట్లను చిన్మయి పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు నయన్.. విఘ్నేష్ దంపతులు సరోగసి పద్దతితో పిల్లలకు జన్మనివ్వడంతో మళ్లీ చిన్మయి పై రూమర్స్ గుప్పుమన్నాయి.

దీంతో ఒక్క ఫోటోతో విమర్శలకు చెక్ పెట్టింది చిన్మయి. ఆమె ప్రెగ్నెంట్‏గా ఉన్నప్పుడు దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ.. ప్రెగ్నెంట్‏గా ఉన్నప్పుడు నేను తీసుకున్న మొదటి సెల్ఫీ ఇది.. అంటూ రాసుకొచ్చింది. ఇక చిన్మయి షేర్ చేసిన ఫోటోతో ఆమె పిల్లల గురించి వస్తున్న రూమర్లకు చెక్ పెట్టేసింది. నేను గర్భవతిగా ఉన్న ఫోటోలను షేర్ చేయకపోవడంతో అందరూ సరోగసి ద్వారా నాకు కవలలు పుట్టారా అని నాకు మేసేజ్ చేస్తున్నారు. వారు అనుకోవడంలో తప్పు లేదు. అది వారి అభిప్రాయం. కానీ నేను నా వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుంటున్నాను. నా పిల్లల ముఖాలను కూడా నేను చూపించను. నా స్నేహితులు.. కుటుంబం గురించి నేను ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాను. మా పిల్లల ఫోటోస్ సోషల్ మీడియాలో ఉండవు అంటూ చెబుతూ ఓ వీడియో షేర్ చేసింది చిన్మయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.