Kantara- RGV: చిన్న సినిమా రికార్డ్స్‏ను బద్దలు కొట్టింది.. కాంతార మూవీపై ఆర్జీవీ రివ్యూ..

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం కాంతార సినిమా గురించి ట్వీట్ చేశారు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై.. భారీ బడ్జెట్ పెద్ద చిత్రాల రికార్డులను బద్దలు కొట్టిందని అన్నారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

Kantara- RGV: చిన్న సినిమా రికార్డ్స్‏ను బద్దలు కొట్టింది.. కాంతార మూవీపై ఆర్జీవీ రివ్యూ..
Kantara Movie, Ram Gopal Varma
Follow us

|

Updated on: Oct 18, 2022 | 5:14 PM

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కాంతారమేనియా కొనసాగుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ముందుగా కన్నడలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీని తెలుగుతోపాటు, హిందీ, తమిళం, కన్నడ భాషలలోనూ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన తెలుగు, హిందీ, తమిళ్ వెర్షన్స్‏కు ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వియ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటికే ప్రభాస్, అనుష్క వంటి స్టార్స్ సైతం ఈ సినిమపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇక ఇప్పుడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం కాంతార సినిమా గురించి ట్వీట్ చేశారు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై.. భారీ బడ్జెట్ పెద్ద చిత్రాల రికార్డులను బద్దలు కొట్టిందని అన్నారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

ముందు రిషబ్ శెట్టి ఇంటర్వ్యూ చూడండి.. తనలో ఉన్న సింప్లిసిటీ కారణంగానే కాంతార లాంటి గ్రేట్ ఫిల్మ్ బయటికి వచ్చిందంటూ.. తన ట్వీట్లో రాసుకొచ్చారు. అంతేకాదు.. భారీ బడ్జెట్ సినిమాలే.. థియేటర్లకు ప్రేక్షకులను రప్పిస్తాయన్న మిత్‌ను కాంతార సినిమాతో.. రిషబ్ షెట్టి బద్దలు కొట్టాడన్నారు. రాబోయే తరాలకు కాంతార ఓ పాఠం అంటూ.. తన ట్వీట్లో కోట్ చేశారు. పెద్ద బడ్జెట్ సినిమాలు తీసేవారికి కాంతార కలెక్షన్స్ ఓ పీడకలని.. 300,400,500 కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీసేవారికి.. ఈ సినిమా కలెక్షన్స్ హార్ట్‌ అటాక్ తెప్పిస్తాయని తన ట్వీట్లో రాసుకొచ్చారు. “కాంతార అనే అద్భుతమైన పాఠాన్ని అందరికీ అందించినందుకు ధన్యవాదాలు, సినిమా పరిశ్రమలోని వారందరూ మీకు ట్యూషన్ ఫీజు చెల్లించాలి” అంటూ.. మరో ట్వీట్ చేసి.. కాంతారాకు..డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ షెట్టికి మరింత ప్రమోషన్ కల్పించారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటివరకు కాంతార సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల వసూలు చేసింది. అంతేకాకుండా.. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ సినిమాగా రికార్డ్ క్రియేట్ చిసంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టితోపాటు.. కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి నటించారు. ఈ సినిమా కంబాలా, కోలా సాంప్రదాయల నేపధ్యంలో తెరకెక్కించారు. హంబాలే ఫిల్మ్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..