AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamannaah: పెళ్లి చేసుకోవాలకుంటున్న మిల్కీబ్యూటీ.. తర్వలోనే పిల్లల్ని కూడా కనేస్తుందట..

తమన్నా మాట్లాడుతూ..తాను పెళ్లికి వ్యతిరేకి కాదని.. త్వరలోనే పెళ్లి చేసుకుని.. పిల్లలను కూడా కనాలనుకుంటున్నట్లు చెప్పింది.

Tamannaah: పెళ్లి చేసుకోవాలకుంటున్న మిల్కీబ్యూటీ.. తర్వలోనే పిల్లల్ని కూడా కనేస్తుందట..
Tamanna
Rajitha Chanti
|

Updated on: Oct 17, 2022 | 3:47 PM

Share

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా గుర్తింపు తెచ్చుకుంది మిల్కీబ్యూటీ తమన్నా. ఈ మూవీలో హవంతిక పాత్రతో ప్రేక్షకుల మనసులను దొచుకుంది. హిందీ, తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిది. ఇటీవలే తెలుగులో ఎఫ్ 3 సినిమాతో అలరించింది. అలాగే హిందీలో బబ్లీ బౌన్సర్ సినిమాలో నటించగా.. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది మిల్కీబ్యూటీ. అయితే చేతినిండా సినిమాలతో ఇటు వెండితెరపై.. అటు డిజిటల్ ప్లాట్ ఫాంపై సందడి చేస్తున్న తమన్నా.. ఇప్పటివరకు పెళ్లి గురించి ఎలాంటి స్పందన లేదు. అలాగే ఈ అమ్మడు ప్రేమ గురించి ఎలాంటి పూకార్లు కూడా నెట్టింట వైరల్ కాలేదు. ప్రేమ, పెళ్లితో ఎలాంటి తనకు సంబంధం లేదన్నట్లుగా వరుస అవకాశాలతో బిజీగా గడిపేస్తుంది. తాజాగా తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ..తాను పెళ్లికి వ్యతిరేకి కాదని.. త్వరలోనే పెళ్లి చేసుకుని.. పిల్లలను కూడా కనాలనుకుంటున్నట్లు తెలిపింది. ” నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు పెళ్లిపై నమ్మకం ఉంది. కాబట్టి సరైన సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. నేనెప్పుడూ ఎదుటివారి నిర్ణయాలపై ఆధారపడను. ఇక భాగస్వామిని కనుగొనే విషయానికి వస్తే .. ఎదుటి వారు ఎలా ఉంటే నచ్చుతారో అదే విధంగా నేను ఆలోచిస్తాను. త్వరలోనే పెళ్లి చేసుకుని పిల్లలను కూడా కనాలని ఉంది. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలను చెప్పేస్తాను ” అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈ మిల్కీబ్యూటీ భోళా శంకర్ మాత్రమే కాకుండా సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తోన్న జైలర్ చిత్రంలోనూ అతిథి పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చాలా కాలం తర్వాత ఈ మూవీతో తమిళ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది తమన్నా.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..