Chiranjeevi Sarja Birth Anniversary: ‘మై డియర్ హస్బెండ్ చిరు.. నీకోసమే ఇంకా నవ్వుతున్నాను’.. కన్నీళ్లు పెట్టిస్తోన్న హీరోయిన్ పోస్ట్..

చిరు.. మేఘన దాదాపు 10 సంవత్సరాలు ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో 2018లో వీరిద్దరు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం మేఘనకు రాయన్ రాజ్ సర్జా అనే కుమారుడు ఉన్నాడు.

Chiranjeevi Sarja Birth Anniversary: 'మై డియర్ హస్బెండ్ చిరు.. నీకోసమే ఇంకా నవ్వుతున్నాను'.. కన్నీళ్లు పెట్టిస్తోన్న హీరోయిన్ పోస్ట్..
Meghana, Chiranjeevi
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 17, 2022 | 3:08 PM

దివంగత కన్నడ హీరో చిరంజీవి సర్జా జయంతి సందర్భంగా ఆయన సతీమణి హీరోయిన్ మేఘనా రాజ్ ఇన్‏స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. అలాగే తమ పెళ్లి నాటి ఫోటో షేర్ చేస్తూ.. ” నా సంతోషానికి శుభాకాంక్షలు. ఏది ఏమైనా ఎవరు ఉన్నా.. ఒక్కరైనా.. ఇద్దరం ఉన్నా.. నేను మాత్రం ఇంకా నీ కోసమే నవ్వుతున్నాను. మై డియర్ హస్బెండ్ చిరు.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అంటూ రాసుకొచ్చారు. ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో.. నెటిజన్స్ ఆమెకు ధైర్యం చెబుతున్నారు. మీరు మరింత ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీ బాధ మాకు తెలుస్తోంది. మేమెప్పటికీ ఆయనను మర్చిపోలేము.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సీనియర్ హీరో అర్జున్ సర్జా అల్లుడిగా కన్నడ చిత్రపరిశ్రమలోకి హీరోగా అరంగేట్రం చేసి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు చిరు. 2020 జూన్ 7న గుండె పోటుతో చిరు తుది శ్వాస విడిచారు. చిరు మరణించినప్పుడు మేఘన 5 నెలల గర్భిణి. చిరు అకాల మరణాన్ని ఇంకా కన్నడిగులు జీర్ణించుకోలేకపోతున్నారు.

చిరు.. మేఘన దాదాపు 10 సంవత్సరాలు ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో 2018లో వీరిద్దరు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం మేఘనకు రాయన్ రాజ్ సర్జా అనే కుమారుడు ఉన్నాడు. ఇటీవల మేఘన రెండవ పెళ్లి చేసుకోబోతుందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఆ వార్తలను ఖండించింది మేఘన. తాను తన కుమారుడి కోసం ధైర్యంతో జీవిస్తున్నానని.. చిరు తనను విడిచిపెట్టి వెళ్లిపోయిన.. తన కుమారుడు తన మొదటి ప్రాధాన్యత అని తెలిపింది.

2009లో చిరు.. వాయుపుత్ర సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత దాదాపు 20 హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ మేనల్లుడిగా సినీరంగ ప్రవేశం చేసిన తన ప్రతిభతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చిరు చివరి సినిమా కన్నడ యాక్షన్ డ్రామా శివార్జున. ఇక ఇటీవలే మేఘన రాజ్ బుల్లితెరపైకి రీఎంట్రీ ఇస్తుంది. ప్రముఖ రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు మేఘన.

View this post on Instagram

A post shared by Meghana Raj Sarja (@megsraj)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?