Bigg Boss 6 Telugu: రంజుగా మండే నామినేషన్స్.. అడ్డంగా బుక్కయిన రేవంత్.. ఆ మిస్టేక్ వల్లే

ఈ వారం నామినేషన్స్ లో రేవంత్‏కు ఎక్కువ ఓట్లు పడినట్లుగా తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో రేవంత్ ను ఎక్కువగా నామినేట్ చేయగా.. గీతూ మాటలకు మరోసారి హర్ట్ అయ్యాడు బాలాదిత్య.

Bigg Boss 6 Telugu: రంజుగా మండే  నామినేషన్స్.. అడ్డంగా బుక్కయిన రేవంత్.. ఆ మిస్టేక్ వల్లే
Bigg Boss 6 Promo
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 17, 2022 | 5:01 PM

బిగ్‏బాస్ సీజన్ 6 ఆరోవారం ఇంటి నుంచి పింకీ అలియాస్ సుదీప ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఎపిసోడ్ ముందుగానే ఆమె ఎలిమినేట్ అయ్యారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఊహించినట్లుగా సుదీప ఇంటినుంచి బయటకు వచ్చింది. అయితే వెళ్తూ వెళ్తూ ఒక్కొక్కరికి చురకలంటించి వెళ్లింది. అయితే 21 మందితో మొదలైన ఈ బిగ్‏బాస్ ఇంట్లో ఇప్పుడు పదిహేను మంది మిగిలారు. ఇక ఇప్పుడు వీరిలో ఒకరిని బయటకు పంపే సమయం వచ్చేసింది. బిగ్‏బాస్ ఇంట్లో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. అయితే ఈ వారం నామినేషన్స్ లో రేవంత్‏కు ఎక్కువ ఓట్లు పడినట్లుగా తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో రేవంత్ ను ఎక్కువగా నామినేట్ చేయగా.. గీతూ మాటలకు మరోసారి హర్ట్ అయ్యాడు బాలాదిత్య.

తాజా ప్రోమోలో.. ముందుగా ఇనయ బిహేవియర్ నచ్చలేదంటూ శ్రీహాన్ ఆమెను నామినేట్ చేశాడు. ఇక ఆ తర్వాత రేవంత్ పడుకోవడం నచ్చలేదంటూ రోహిత్ నామినేట్ చేశాడు. అలాగే.. కెప్టెన్ అయ్యి.. మిగతావారు పడుకోకుండా చూడాల్సిన నువ్వే పడుకున్నావంటూ రేవంత్‏ను బాలాదిత్య, మెరీనా నామినేట్ చేశారు. ఇక శ్రీసత్యకు మరో ఆప్షన్ లేకపోవడంతో తన స్నేహితుడు రేవంత్‏ను నామినేట్ చేసింది. అయితే ఎక్కువగా భయపడుతున్నావంటూ వాసంతిని నామినేట్ చేశాడు ఆదిరెడ్డి. రెండు సార్లు సోఫా వెనక నిలబడ్డారు అంటూ ఆదిరెడ్డి అనగా.. మీరు కెప్టెన్ అయ్యి కూడా జీరో అయ్యారుగా అంటూ కౌంటరిచ్చింది వాసంతి.

ఎంటర్టైన్మెంట్ చేయలేదంటూ ఆదిరెడ్డిని నామినేట్ చేశాడు అర్జున్ కళ్యాణ్. మంచి వాడిగా ఎలా ఉన్నావో అలాగే ఇంటి నుంచి వెళ్లిపోతే బాగుంటుంది అని గీతూ చెప్పగా.. నీకు సమాధానం చెప్పదలుచుకోలేదు అంటూ బాలదిత్య అన్నాడు. ఏ ఇంటి గురించి మంచిగా నేను ఆలోచిస్తున్నానో… అదే ఇల్లు నా గురించి ఎలా ఆలోచిస్తుందనేది ఆరోజు నాగార్జున గారు వీడియో చూపించినప్పుడు కాదు.. ఇప్పుడు ఎక్కువ క్లారిటీ వచ్చింది అంటూ బాధపడ్డాడు బాలాదిత్య. మొత్తంగా కెప్టెన్‏గా ఉండి రెండు సార్లు నిద్రపోయిన రేవంత్‍కు ఈవారం ఎక్కువగానే నామినేట్ ఓట్స్ పడినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.