AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ లేదా ?? చార్జీలు బాది రూ. 8 వేల కోట్లు సంపాదించిన బ్యాంకులు

అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ లేదా ?? చార్జీలు బాది రూ. 8 వేల కోట్లు సంపాదించిన బ్యాంకులు

Phani CH
|

Updated on: Feb 06, 2026 | 9:30 AM

Share

బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ నిర్వహించనందుకు గత మూడేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.8,092 కోట్లు వసూలు చేశాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి లోక్‌సభకు తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అత్యధికంగా రూ.1,538 కోట్లు వసూలు చేయగా, ఎస్‌బీఐ ఎలాంటి ఛార్జీలు విధించలేదు. ఎస్‌ఎంఎస్‌ల కోసం అదనంగా రూ.3,387 కోట్లు వసూలయ్యాయి. ప్రైవేట్ బ్యాంకుల వసూళ్లు దీనికి అదనం.

మినిమం బ్యాలెన్స్. అంటే అకౌంట్‌లో ఏడాదిలో 5 వేలు 10 వేలు కూడా లేకపోవడం.. అలాంటి బ్యాంకు ఖాతాలకు ఫైన్స్ జరిమానాలు వేసాయి బ్యాంకులు. దేశ వ్యాప్తంగా మన బ్యాంకులు.. డబ్బులు లేని బ్యాంక్ ఖాతాలపై జరిమానాలు వేయడం ద్వారా ఎంత సంపాదించాయో తెలుసా.. అక్షరాల 8 వేల కోట్ల రూపాయలు.ఈ సమాచారం దేశ బ్యాంకింగ్ రంగ చరిత్రలో సంచలనం సృష్టించింది. బ్యాంక్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు ఖాతాదారులపై జరిమానా విధిస్తాయి. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ గత కొన్ని సంవత్సరాలుగా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయనందుకు ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదు. అయితే ఇతర ప్రభుత్వ బ్యాంకులు ఛార్జీలను విధిస్తూనే ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ గత ఐదేళ్లలో అత్యధికంగా రూ.1,538 కోట్ల పెనాల్టీని వసూలు చేసింది. ఇలా మినిమం బ్యాలెన్స్ లేని అకౌంట్లపై గత మూడేళ్లలో బ్యాంకులు ఎన్ని జరిమానాలు విధించాయని లోక్ సభలో ఓ ఎంపీ ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌధరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత మూడేళ్లలో మినిమం బ్యాలెన్స్ లేని ఖాతాదారుల నుంచి బ్యాంకులు రూ.8,092 కోట్ల ఛార్జీ వసూలు చేసినట్లు ఆయన తెలిపారు. ఇవి కేవలం దేశంలోని 11 ప్రభుత్వరంగ బ్యాంక్ వసూల్ చేసిన చార్జీలే. హెచ్‎డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్ వంటి ప్రైవేట్ బ్యాంకులు వసూల్ చేసిన ఛార్జీలు ఇందుకు అదనం. కస్టమర్లకు బ్యాంక్ కార్యకలాపాలకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌లు పంపినందుకు చార్జీల కింద రూ.3,387 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోగి గొంతులో బ్రతికున్న జలగ.. కట్ చేస్తే చేస్తే ఖేల్ ఖతం.. దుకాన్ బంద్

కల్కి సినిమాలో మ్యాజిక్ చేసిన ఆలయం ఇదే.. నిజంగానే ఉంది

Sweet Potato: చిలగడదుంపతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదలరు

శ్వేతవర్ణంలో మెరిసిపోతున్న కాశ్మీర్‌.. ఒక్క సారి నా కళ్ళతో చూడు మావా

Varanasi: వారణాసి డ్యూరేషన్‌ రివీల్ చేసిన జక్కన్న.. బాబోయ్ మరీ అన్ని గంటలా !