AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తనంతట తానుగా ఇంధనం'కటాఫ్' పొజిషన్‌కు స్విచ్‌ తప్పిన పెను విమాన ప్రమాదం

తనంతట తానుగా ఇంధనం’కటాఫ్’ పొజిషన్‌కు స్విచ్‌ తప్పిన పెను విమాన ప్రమాదం

Phani CH
|

Updated on: Feb 06, 2026 | 9:15 AM

Share

లండన్-బెంగళూరు ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ ఆటోమెటిక్‌గా 'కటాఫ్' పొజిషన్‌కు వెళ్లడంతో విమానాన్ని బెంగళూరులో నిలిపివేశారు. 2015లో ఇలాంటి లోపంతోనే విమానం కూలిన సంఘటన ఉంది. దీనిపై DGCA విచారణకు ఆదేశించింది. బోయింగ్ నిపుణులు పరిశీలిస్తున్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా సమస్య పరిష్కారమయ్యే వరకు విమానాన్ని నడపబోమని ఎయిర్ ఇండియా తెలిపింది.

ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. లండన్ నుంచి బెంగళూరు వచ్చిన ఈ విమానంలో ‘ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్’ సరిగ్గా పనిచేయకపోవడంతో అధికారులు అలర్టయ్యారు. ఇంజిన్‌కు ఇంధనాన్ని సరఫరా చేసే ఈ స్విచ్ ఆటోమేటిక్‌గా ‘కటాఫ్’ పొజిషన్‌కు వెళ్తుండటంతో పైలట్లు కంగారుపడ్డారు. భద్రతా కారణాలతో విమానాన్ని బెంగళూరు విమానాశ్రయంలోనే నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. సోమవారం హీత్రూ నుంచి బెంగళూరు చేరుకున్న డ్రీమ్‌లైనర్‌ విమానం ఇంజిన్ స్టార్ట్ చేసే సమయంలో ఈ లోపం బయటపడింది. సాధారణంగా ఇంజిన్ నడవాలంటే స్విచ్ ‘రన్’ మోడ్‌లో ఉండాలి. కానీ రెండుసార్లు ఆ స్విచ్ తనంతట తానుగా ‘కటాఫ్’ పొజిషన్‌కు మారిపోయింది. దీనిపై ఎయిర్ ఇండియా యాజమాన్యం విమాన తయారీ సంస్థ ‘బోయింగ్’ కు సమాచారం అందించింది. ఈ సాంకేతిక లోపంపై ఆందోళనపడటానికి ఒక బలమైన కారణం ఉంది. 2025 జూన్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన భయంకరమైన డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. టేకాఫ్ అయిన కొద్ది సెకన్లకే రెండు ఇంజిన్ల ఫ్యూయల్ స్విచ్‌లు ఒకదాని తర్వాత ఒకటి ‘కటాఫ్’ పొజిషన్‌కు మారిపోయాయనీ అప్పట్లో పైలట్లు తాము స్విచ్‌లు ఆపలేదని చెప్పినప్పటికీ ఇంజిన్లు పవర్ కోల్పోయి విమానం కుప్పకూలింది. విమానంలో థ్రస్ట్ లివర్ల కింద ఉండే ఈ రెండు స్విచ్‌లు ఇంజిన్‌కు ఇంధన సరఫరాను నియంత్రిస్తాయి. అవి స్ప్రింగ్ మెకానిజంతో ఉంటాయి. పైలట్ కావాలని పైకి లాగి జరిపితే తప్ప అవి మారవు. ఒకవేళ గాలిలో ఉన్నప్పుడు అవి ‘కటాఫ్’ అయితే వెంటనే ఇంజిన్ ఆగిపోతుంది. ఈ ఘటనపై విమానయాన సంస్థ డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం బోయింగ్ ప్రతినిధులు బెంగళూరులో విమానాన్ని పరిశీలిస్తున్నారు. కేవలం ఒక విమానానికే ఈ సమస్య ఉందా లేక ఎయిర్ ఇండియా ఫ్లీట్‌లోని అన్ని 787 విమానాలకు ఉందా అనేది తేల్చనున్నారు. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని, లోపం పూర్తిగా సరిదిద్దే వరకు ఈ విమానాన్ని నడపబోమని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోగి గొంతులో బ్రతికున్న జలగ.. కట్ చేస్తే చేస్తే ఖేల్ ఖతం.. దుకాన్ బంద్

కల్కి సినిమాలో మ్యాజిక్ చేసిన ఆలయం ఇదే.. నిజంగానే ఉంది

Sweet Potato: చిలగడదుంపతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదలరు

శ్వేతవర్ణంలో మెరిసిపోతున్న కాశ్మీర్‌.. ఒక్క సారి నా కళ్ళతో చూడు మావా

Varanasi: వారణాసి డ్యూరేషన్‌ రివీల్ చేసిన జక్కన్న.. బాబోయ్ మరీ అన్ని గంటలా !