AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: పెద్ద ప్లానింగే.. భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పాక్ – బంగ్లా భారీ కుట్ర..!

Bangladesh - Pakistan: పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒక్కటిగా నిలిచాయి. బంగ్లాదేశ్ జట్టును టీ20 ప్రపంచకప్ నుంచి తప్పించడంతో పీసీబీ తట్టుకోలేకపోతోంది. ఈ క్రమంలో భారత జట్టుతో మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి, బంగ్లాకు అండగా నిలిచామంటూ ప్రకటించింది. ఈ క్రమంలో బంగ్లా కూడా పాక్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ చేసింది.

T20 World Cup: పెద్ద ప్లానింగే.. భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పాక్ - బంగ్లా భారీ కుట్ర..!
Bangladesh Pakistan
Venkata Chari
|

Updated on: Feb 06, 2026 | 9:12 AM

Share

Bangladesh Pakistan: పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల అక్రమ సంబంధం మరోసారి బట్టబయలైంది. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్ జట్టు టీమిండియాతో మ్యాచ్ ఆడమంటూ ప్రకటించింది. దీనికి బంగ్లాదేశ్ మద్దతుగా నిలిచింది. ఈమేరకు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కు ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ చేసింది. ఇన్నాళ్లు అసలు ఎందుకు భారత జట్టు మ్యాచ్ ను బహిష్కరిస్తున్నారో చెప్పని పాక్ జట్టు.. ఎట్టకేలకు మౌనం వీడినట్లైంది. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రీడా సలహాదారుర ఆసీఫ్ నజ్రుల్ పాక్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ధన్యవాదాలు పాకిస్తాన్ అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో వీరి అక్రమ సంబంధం మరోసారి బయటపడింది. దీంతో బంగ్లాదేశ్ ను టీ20 ప్రపంచకప్ నుంచి తప్పించడాన్ని పాక్ సహించలేకపోయింది. ఇందుకోసమే భారత జట్టుతో మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్రధానమంత్రి షెహబాబ్ షరీఫ్ తెలపి బంగ్లాదేశ్ జట్టుకు అండగా నిలిచింది.

ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ఏర్పాటు చేసిన తాత్కాలిక టీంలో నజ్రుల్ క్రీడా సలహాదారుగా పనిచేస్తున్నాడు. జులై – ఆగస్టు 2024 ఆందోళనలో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో నజ్రుల్ క్రీడా మంత్రిగా ఉన్నాడు.

కాగా, “భద్రతా సమస్యల” కారణంగా భారత గడ్డపై మ్యాచ్‌లు ఆడటానికి బంగ్లాదేశ్ నిరాకరించింది. దీంతో ఐసీసీ బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టును చేర్చింది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌తో జరగనున్న మ్యాచ్‌కు దూరంగా ఉండాలని షరీఫ్ ప్రభుత్వం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి సూచించింది.

పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రకటన తర్వాత నజ్రుల్ నుంచి క్లారిటీ వచ్చింది. “టీ20 ప్రపంచ కప్ విషయంలో మేం చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నాం. ఎందుకంటే క్రీడా మైదానంలో ఎటువంటి రాజకీయాలు ఉండకూడదు. కాబట్టి, మేం భారత్‌తో మ్యాచ్ ఆడబోం” అని షరీఫ్ ఇస్లామాబాద్‌లో జరిగిన ప్రభుత్వ సమావేశంలో ప్రటించాడు.

“మేం చాలా ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. మేం పూర్తిగా బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలిచాం. ఇది చాలా సముచితమైన నిర్ణయం అని నేను భావిస్తున్నాను. మేం బంగ్లాదేశ్‌తో ఉన్నాం” అని ఆయన తెలపారు.

టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ బహిష్కరణ వెనుక గల కారణాన్ని బహిరంగంగా వెల్లడించిన పాకిస్తాన్ ప్రభుత్వం లేదా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నుంచి వచ్చిన మొదటి అధికారిక వ్యాఖ్యలు ఇవే కావడం గమనార్హం. అంతకుముందు, భారతదేశంలో తమ క్రికెటర్లకు సురక్షితం కాదంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చేసిన వాదన తేలిపోయింది. భద్రతా కారణాలను చూపుతూ టీ20 ప్రపంచ కప్ కోసం బంగ్లా క్రికెట్ బోర్డు తన జట్టును భారతదేశానికి పంపడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల తర్వాత, ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లలో పోటీ పడేందుకు బంగ్లాదేశ్ షూటర్‌కు అనుమతి ఇవ్వడం గమనార్హం.

హసీనా ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్‌లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా క్రికెట్ రాజకీయాలు కీలక మలుపు తీసుకున్నాయి. ఈ క్రమంలో బంగ్లాకు అండగా పాకిస్తాన్ పనిచేస్తోంది. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధం బలపడింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల మధ్య 14 సంవత్సరాల విరామం తర్వాత ఢాకా-ఇస్లామాబాద్ విమానాలను తిరిగి ప్రారంభించాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి