AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: టీమిండియా ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. భారత్, అఫ్గానిస్థాన్ సిరీస్ షెడ్యూల్ మార్పు?

IND vs AFG: మూడు టీ20ల సిరీస్ షెడ్యూల్ ప్రకటించిన 24 గంటల్లోనే అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు తేదీల మార్పు కోరింది. సెప్టెంబర్ 14న మ్యాచ్ నిర్వహించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. వినాయక చవితి కారణంగా ఈ మార్పు కోరినట్లు తెలుస్తోంది. బీసీసీఐ నిర్ణయం కోసం ఎదురుచూపులు నెలకొన్నాయి.

IND vs AFG: టీమిండియా ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. భారత్, అఫ్గానిస్థాన్ సిరీస్ షెడ్యూల్ మార్పు?
Ind Vs Afg
Rakesh
|

Updated on: Aug 13, 2026 | 3:04 PM

Share

IND vs AFG: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరగాల్సిన టీ20 సిరీస్ షెడ్యూల్‌లో హఠాత్తుగా మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ విడుదలైన మరుసటి రోజే అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ ముందు కొత్త ప్రతిపాదన ఉంచడంతో మ్యాచ్ తేదీలు మారే అవకాశం ఏర్పడింది. బీసీసీఐ ఆగస్టు 12న అఫ్గానిస్థాన్‌తో జరగబోయే మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఖరారైన షెడ్యూల్ ప్రకారం తొలి మ్యాచ్ సెప్టెంబర్ 13న, రెండో మ్యాచ్ సెప్టెంబర్ 15న, మూడో మ్యాచ్ సెప్టెంబర్ 17న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే ఈ షెడ్యూల్ విడుదలైన 24 గంటల్లోనే అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. మ్యాచ్ తేదీల్లో మార్పులు చేయాలని బీసీసీఐని కోరింది.

వినాయక చవితి సెంటిమెంట్

తొలి లేదా రెండో టీ20 మ్యాచ్‌ను సెప్టెంబర్ 14వ తేదీకి మార్చాలని అఫ్గానిస్థాన్ బోర్డు కోరినట్లు సమాచారం. సెప్టెంబర్ 14న దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి పండుగ ఉంది. అఫ్గాన్ విజ్ఞప్తిని బీసీసీఐ ఆమోదిస్తే టీమిండియా వరుసగా రెండు రోజులు మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుంది. ఒకవేళ మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 14కి జరిపితే, ఆ తర్వాతి రోజే అంటే సెప్టెంబర్ 15న రెండో టీ20 జరుగుతుంది. క్రికెట్ చరిత్రలో భారత్ ఒక జట్టుకు ఆతిథ్యమిస్తున్నప్పటికీ, ఈ మ్యాచ్‌లను అఫ్గానిస్థాన్ స్వదేశీ సిరీస్‌గా పరిగణించడం విశేషం. డెహ్రాదూన్, లక్నో, గ్రేటర్ నోయిడా మైదానాలను అఫ్గాన్ జట్టుకు హోమ్ గ్రౌండ్లుగా బీసీసీఐ ఇదివరకే కేటాయించింది.

బంగ్లాదేశ్ టూర్‌పై అనుమానాల నీడలు

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్ ఖరారు కావడంతో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన పూర్తిగా ప్రమాదంలో పడింది. రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గత ఏడాది ఆగస్టు నుంచి వాయిదా పడుతూ వస్తున్న బంగ్లాదేశ్ సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. సిరీస్ పునరుద్ధరణ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) బీసీసీఐని సంప్రదించినప్పటికీ భారత బోర్డు నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన రాలేదు. భారత జట్టు రాబోయే నెలల్లో బిజీ షెడ్యూల్‌తో ఉండటం, ఇప్పుడు అఫ్గాన్ సిరీస్ ఖరారు కావడంతో బంగ్లాదేశ్ టూర్ రద్దయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!