Demon Pavan Rithu Chowdary: ఫ్రెండ్షిప్ గొడవకు బ్రేకప్ ఏంట్రా.. మేము ఏమైనా లవర్సా.. రీతూ చౌదరీ పోస్ట్..
బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా పాపులర్ అయిన జంటలు చాలా మంది ఉన్నాయి. అయితే హౌస్ లో తమ క్యూట్ క్యూట్ ఫ్రెండ్షిప్ ద్వారా జనాలకు దగ్గరైన వారు.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కలిసి ఉండడం చాలా అరుదు. అయితే ఇటీవల పాటల ద్వారా నెట్టింట అభిమానులను అలరించిన డెమాన్ పవన్, రీతూ చౌదరి ఇద్దరి స్నేహానికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.

బిగ్‌బాస్ వేదికగా పరిచయమై, బయటకూడా ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న పాపులర్ జోడీ డీమాన్ పవన్ – రీతూ చౌదరి. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరు కలిసి పలు షోలలో పాల్గొన్నారు. అంతేకాదు ఇద్దరూ కలిసి ఓ సాంగ్ కూడా చేయగా యూట్యూబ్ లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ జంటకు నెట్టింట సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉందన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరి బంధానికి ముగింపు పడుతూ ఇటీవల డీమాన్ పవన్ సోషల్ మీడియాలో పెట్టిన సుదీర్ఘమైన ఎమోషనల్ పోస్ట్ బుల్లితెర వర్గాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. “మా స్నేహం ముగిసింది.. ఎవరు ఎవరినీ వాడుకోలేదు” అంటూ పవన్ క్లారిటీ ఇవ్వగా, వీరి స్నేహం బ్రేక్ కావడంపై నెట్టింట తెగ పోస్టులు, మీమ్స్ వచ్చాయి. తాజాగా ఈ వ్యవహారంపై నటి రీతూ చౌదరి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
డీమాన్ పవన్ ఎమోషనల్ పోస్ట్:
బిగ్‌బాస్ హౌస్‌లో పరిచయమైన వీరిద్దరూ బయటకు వచ్చాక కలిసి ఈవెంట్లు, డ్యాన్స్ షోలు, ఆల్బమ్ సాంగ్స్ కూడా చేశారు. దాంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం సాగింది. అయితే తమ మధ్య గొడవలు పెరిగిపోవడంతో బ్రేకప్ చెప్పుకున్నామని పవన్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నామని, ఇకపై ఎవరి దారి వారిదేనని స్పష్టం చేశాడు.
రీతూ చౌదరి వ్యాఖ్యలు:
పవన్ పోస్ట్‌పై రీతూ చౌదరిని నెటిజన్లు, మీడియా ప్రశ్నించగా ఆమె చాలా లైట్‌గా, అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. “అసలు మేమేమైనా లవర్సా? పెళ్లి చేసుకున్నామా? బ్రేకప్ అని చెప్పుకోవడానికి! మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే. ఏదో పెద్ద బ్రేకప్ అయిపోయినట్లు అందరూ ఇంత రచ్చ చేస్తున్నారు. జనాలు ఇంత ఖాళీగా ఉన్నారా?.. మీ ఫ్రెండ్స్‌తో మీకు గొడవలు అవ్వవు.. దేనికి రా నిబ్బా గాళ్లు.. వాడు ఏదో పెట్టాడు.. మీరు ఇంత ఖాళీగా ఉన్నారు ఏంట్రా.. ఏదైతేనేం.. నాకు ఒక్క రోజులోనే 25 వేల మంది ఫాలోవర్స్ వచ్చారు.. థాంక్యూ ” అంటూ రీతూ తన ఇన్ స్టాలో స్టోరీస్ పెట్టింది. ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్న మనస్పర్థలు రావడం సహజమని, దానికి ఇంత సీన్ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది రీతూ.
ఒకవైపు డీమాన్ పవన్ తీవ్ర ఆవేదనతో పర్సనల్ చాట్లు, బ్లాకింగ్‌ల గురించి సుదీర్ఘ పోస్ట్ పెడితే, మరోవైపు రీతూ చౌదరి దానిని చాలా సాధారణ విషయంగా కొట్టిపారేయడం గమనార్హం. దీంతో వీరిద్దరి వ్యాఖ్యల మధ్య పొంతన లేకపోవడంతో అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది నిజంగానే ఇద్దరి మధ్య వచ్చిన విభేదాలా? లేదా ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లేదా షో ప్రమోషన్ కోసం చేస్తున్న పబ్లిసిటీ స్టంటా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ‘రివాన్’ జంట విడిపోవడంపై వారి అభిమానులు మాత్రం తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఈ సినిమాకు ఏం డిమాండ్ రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న మూవీ.. ఫ్యామిలీతో అస్సలు చూడలేరు..
ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.. నయనతార..
