AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? వైరల్‌గా పోస్ట్‌

కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? వైరల్‌గా పోస్ట్‌

Phani CH
|

Updated on: Feb 06, 2026 | 9:35 AM

Share

బెంగళూరులో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో పోలీసు నిర్లక్ష్యంపై ఓ స్టార్టప్ ఫౌండర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ చర్చనీయాంశమైంది. కోటి సంపాదిస్తున్న తన సోదరి ప్రాణానికి విలువ లేదా అని ప్రశ్నిస్తూ, డ్రైవర్‌ను అరెస్టు చేయకపోవడం, FIR నమోదుకు నిరాకరించడం, ఇన్సూరెన్స్‌తో సెటిల్ చేసుకోమని సూచించడం వంటి అంశాలపై వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పన్ను చెల్లించే పౌరుల రక్షణకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తింది.

బెంగళూరులో జరిగిన ఒక ‘హిట్ అండ్ రన్’ కేసుకు సంబంధించి పోలీసుల నిర్లక్ష్యంపై ఒక స్టార్టప్ ఫౌండర్‌ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది. కోటి సంపాదిస్తున్న తన సోదరి ప్రాణానికి విలువ లేకుండాపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేసిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది.బెంగళూరు పోలీసుల తీరుపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Overlayy అనే AI స్టార్టప్ వ్యవస్థాపకుడు స్నేహిల్ సలూజా, తన సోదరి , ఆమె స్నేహితురాలికి ఎదురైన భయానక అనుభవాన్ని ట్విటర్‌ లో పోస్ట్‌ చేసారు. స్నేహిల్‌ కారులో ఆయన సోదరి, ఆమె స్నేహితురాలు ప్రయాణిస్తున్నారు. బెంగళూరులోని ఒక రెడ్ లైట్ సిగ్నల్‌ పడినపుడు, స్నేహిల్ సోదరి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఒక మినీ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు కానీ, ట్రక్కు యజమానిపట్ల పోలీసులు నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారనీ ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, ఆ విషయం పోలీసులకు , ట్రక్కు యజమానికి కూడా తెలుసని, అయినా ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్‌ను అరెస్టు చేయలేదనీ కనీసం FIR నమోదు చేయడానికి కూడా పోలీసులు నిరాకరించారని స్నేహిల్ ఆరోపించారు. ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు కదా, కేసు ఎందుకు? ఇన్సూరెన్స్‌తో సెటిల్ చేసుకోమని పోలీసులు బాధితులకు సూచించారనేది ఆయన వాదన. ట్రక్కు యజమానులు పోలీసులకు క్రమం తప్పకుండా లంచాలు ఇస్తుంటారని, అందుకే వారిపై ఎలాంటి చర్యలు ఉండవని ఒక అధికారి బాధితులతో అన్నట్లు స్నేహిల్ చెప్పుకొచ్చాడు. ఈ ఘటన తర్వాత తన సోదరి బెంగళూరు రోడ్లపై తిరగాలంటేనే భయపడుతోందని, సామాన్య పౌరులకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలపై నమ్మకం పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు పూర్తిస్థాయి ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాలు చూపి క్లెయిమ్‌ను తిరస్కరించినట్లు తెలిపారు. చట్టాన్ని గౌరవించే, పన్ను చెల్లించే నిపుణులను రక్షించడంలో వ్యవస్థ విఫలమైందని స్నేహిల్ వాపోయాడు. బాధితుల్లో ఒకరు ప్రధాన డేటా కంపెనీలో పనిచేస్తున్న, ఉన్నత IIT-JEE ర్యాంక్ కలిగిన యువ AI అనీ కోటి రూపాయలు సంపాదించి పన్నులు కట్టే వారి పరిస్థితి ఇలా ఉంటే, ఇక సాధారణ పౌరులు వ్యవస్థను ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించాడు. ఇటువంటి పరిస్థితుల వల్లే ప్రతిభావంతులైన యువత విదేశాలకు వెళ్ళిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోగి గొంతులో బ్రతికున్న జలగ.. కట్ చేస్తే చేస్తే ఖేల్ ఖతం.. దుకాన్ బంద్

కల్కి సినిమాలో మ్యాజిక్ చేసిన ఆలయం ఇదే.. నిజంగానే ఉంది

Sweet Potato: చిలగడదుంపతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదలరు

శ్వేతవర్ణంలో మెరిసిపోతున్న కాశ్మీర్‌.. ఒక్క సారి నా కళ్ళతో చూడు మావా

Varanasi: వారణాసి డ్యూరేషన్‌ రివీల్ చేసిన జక్కన్న.. బాబోయ్ మరీ అన్ని గంటలా !